సినీఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సింగర్ శివమోగ సుబ్బన్న (83)కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అలాగే సుబన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
గుండెపోటుతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ సింగర్ కన్నుమూత - నేషనల్ అవార్డ్ విన్నింగ్ సింగర్ కన్నుమూత
ప్రముఖ సింగర్, జాతీయ అవార్డు గ్రహీత శివమోగ సుబన్న(83) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
![గుండెపోటుతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ సింగర్ కన్నుమూత National award winning playback singer Shivamoga Subbanna passed away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16081485-thumbnail-3x2-singerrr.jpg)
గుండెపోటుతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ సింగర్ కన్నుమూత
కన్నడలో ప్లేబ్యాక్ సింగింగ్‌లో జాతియ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా గుర్తింపు పొందారు సుబన్న. కాడు కుదురె(Kaadu kudure) చిత్రంలోనే కాడు కుదురె ఒడి బండిట్టా పాటకు ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కాగా, సుబన్న ఎక్కువగా పద్యాలను పాడుతుంటారు. కెరీర్లో ఇంకా మరెన్నో అవార్డులను అందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్లోనూ పనిచేశారు.
ఇదీ చూడండి:'Jr.NTR కోసం హరికృష్ణ ఫోన్ చేశారు.. లేదంటే ఆ సూపర్ హిట్ మూవీలో వేరే హీరో!'