Naresh wife ramya raghupathi : సీనియర్ నటుడు నరేశ్‌కు బెంగుళూరు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయన నటించిన 'మళ్ళీ పెళ్లి' చిత్రం థియేటర్, ఓటీటీలో విడుదల నిలిపివేయాలంటూ ఈ మధ్యనే ఆయన మూడో భార్య రమ్య రఘుపతి కోర్టులో దావా వేసింది. దాన్ని తాజాగా కోర్టు కొట్టిపారేసింది. ఇరు పక్షాల వాదనను విన్న కోర్టు, మెరిట్ లేని కారణంగా రఘుపతి పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లుగా తీర్పును ఇచ్చింది. రమ్య రఘుపతి పిటిషన్లో ఉన్న కారణాలు సమర్థించలేనిదని పేర్కొంది.
naresh malli pelli movie : సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ పరంగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా ఓ కల్పిత కథని న్యాయస్థానం తెలిపింది. సెన్సార్ బోర్డు ఓ చిత్రాన్ని.. కల్పితమని సర్టిఫికెట్ ఇస్తే ఆ సినిమా రిలీజ్‌ను ఇతర వ్యక్తులు ఎవ్వరూ అడ్డుకునేందుకు హక్కు లేదని క్లారిటీ ఇచ్చింది. నిర్మాతలు ఎక్కడైనా తన సినిమాను ప్రసారం చేసుకోవచ్చని చెప్పింది.
అందుకే కోర్టుకు.. రమ్య రఘుపతితో విడిగా ఉంటున్న నరేశ్.. నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్ షిప్లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా చేశారు. తనకు డివొర్స్ ఇవ్వకుండా.. మరో మహిళతో నరేశ్ ఎలా సన్నిహితంగా ఉంటారంటూ రమ్య గతంలో పెద్ద రచ్చ చేశారు. 'మళ్ళీ పెళ్లి'లో తమ వ్యక్తిగత జీవితాన్ని.. మరీ ముఖ్యంగా తనను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తీశారని ఆమెను కోర్టును ఆశ్రయించారు.
రమ్య రఘుపతి రాకుండా.. నరేశ్ ఫ్యామీలికి చెందిన మరో కేసు లోనూ ఊరట లభించింది. నరేశ్‌కు చెందిన నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి రమ్యరఘుపతి రాకూడదని.. ఆయన కుటుంబసభ్యులు గతంలో న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. నరేశ్ ఇంట్లోకి రమ్య రాకూడని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.