తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొత్త ట్విస్ట్ ఇచ్చిన నరేశ్​- పవిత్ర​.. ఏంటి ఇదంతా 'మళ్లీ పెళ్లి' కోసమా? - నరేశ్​ పవిత్ర మళ్లే పెళ్లి సినిమా

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్​ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అంతే కాదు ఆ పోస్టర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ పోస్టర్ సంగతి చూద్దాం రండి.

Etv naresh-pavitra-lokesh-malli-pelli-movie-first-look released
naresh-pavitra-lokesh-malli-pelli-movie-first-look released

By

Published : Mar 24, 2023, 2:18 PM IST

టాలీవుడ్​లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేర్లు సీనియర్ నటుడు నరేశ్​, నటి పవిత్ర లోకేశ్​. గత కొన్ని నెలలుగా వీరి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇద్దరూ డేటింగ్​లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల నరేశ్​ విడుదల చేసిన వీడియో చూసి వీరిద్దరూ నిజంగానే మళ్లీ పెళ్లి చేసుకున్నారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా నరేశ్​ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ చూస్తే.. మొన్న జరిగింది పెళ్లి కాదా? అని అనిపించక మానదు!

ఇటీవలే నరేశ్​-పవిత్ర లోకేశ్​ కలసి ఓ సినిమాలో నటించారు. అదే 'మళ్లీ పెళ్లి'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్​, ఫస్ట్ లుక్ పోస్టర్​ను విడుదల చేశారు నరేశ్​. ఇందులో పవిత్ర​ ముసిముసిగా నవ్వుతూ ముగ్గు వేస్తుంటే.. నరేశ్​ కొంటెగా చూస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నరేశ్​ పెట్టిన పెళ్లి వీడియో కేవలం సినిమా పబ్లిసిటీ కోసమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది నరేశ్​, పవిత్రా లోకేశ్​ కలసి త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు ఓ రొమాంటిక్ వీడియోను పోస్ట్ చేశారు. అంతే కాదు కొన్నిరోజుల తర్వాత నరేశ్​-పవిత్ర ల పెళ్లి అయిపోయినట్టు ఓ వీడియోను నరేశ్​ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. దీంతో నరేశ్-పవిత్రల పెళ్లి అయిపోయిందని, హనీమూన్​కు కూడా వెళ్లిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ వ్యవహారం చూసి అంతా షాక్ అయ్యారు. ఇలా కూడా పబ్లిసిటీ చేసుకుంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నరేశ్​, పవిత్ర ప్రధాన పాత్రల్లో చేస్తున్న సినిమానే ఈ మళ్లీ పెళ్లి. ఈ సినిమాకు ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ బైలింగ్యువల్ సినిమాగా తీస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు మూవీ టీమ్. సూపర్​స్టార్​ కృష్ణ భార్య విజయ నిర్మల మరణించిన తర్వాత ఈ బ్యానర్​పై ఎలాంటి సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఈ విజయకృష్ణ మూవీస్ బ్యానర్​లో నరేశ్​ 'మళ్లీ పెళ్లి' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా థియేటర్లలోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details