టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్-పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే! ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ జంట ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మళ్లీ పెళ్లి'. ఇప్పటికే ఈ జంట రియల్ లైఫ్ రిలేషన్‌షిప్‌తో కాంట్రవర్సీని ఎదుర్కోవడంతో సినిమాపై ఆడియెన్స్ కాస్త ఇంట్రెస్ట్‌గానే ఉన్నారు. నటుడు నరేశ్ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే విడుదలైన ఈ ప్రచార చిత్రంలో నరేంద్రగా నరేశ్, పార్వతిగా పవిత్రా లోకేశ్ కనిపించారు. రెండో భార్య పాత్రలో వనితా విజయ్ కుమార్ కనిపించారు. సీనియర్ నటి అన్నపూర్ణ తనదైన డైలాగులతో అలరించారు. కొంతకాలంగా కలిసి ఉంటూ.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న నరేశ్, పవిత్ర జీవితంలో చోటుచేసుకున్న పలు సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథాంశం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
'పార్వతీ.. మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటారా' అని నరేశ్.. పవిత్రను అడగడంతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో వారి మధ్య పరిచయం ప్రేమగా ఎలా మారింది, బెంగళూరు హోటల్లో జరిగిన గొడవ ఎపిసోడ్, మూడో భార్యను నరశ్ తన్నడం వంటి అంశాలను చూపించారు. అలానే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో సన్నివేశాలను కూడా చూపించే ప్రయత్నం చేశారు. అలానే నరేశ్ ఆస్తిపై ఆయన మూడో భార్య కన్నేసినట్టు.. 'ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే'.. అంటూ వనితా విజయ్ కుమార్‌తో డైలాగ్ చెప్పించారు.
ఇకపోతే ఈ చిత్రానికి కథతో పాటు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ కృష్ణ బ్యానర్‌పై నరేశ్ నిర్మాతగా రూపొందించారు. ఇప్పటికే ఈ 'మళ్లీ పెళ్లి' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ రిలీజై సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా ట్రైలర్‌తో మరోసారి మేకర్స్ ఆసక్తి పెంచారు. ఈ చిత్రంలో శరత్‌బాబు, జయసుధ, వనితా విజయ్ కుమార అనన్య నాగెళ్ల, రవివర్మ, రోషన్, భద్రం, అన్నపూర్ణ, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రం మే26న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇదీ చూడండి: ఈ మలయాళీ అందాన్ని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో?