Naresh 3 Marriages : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి తెలిసిందే. పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తాడు. 'జబర్దస్' కామెడీ షోతో బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా మారిన అతడు.. ప్రస్తుతం సినిమాల్లోనూ వరుస అవకాశాలను అందుకంటూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. పెద్ద హీరోల చిత్రాల్లోనూ మెరుస్తున్నాడు. అలాగే పలు ఈవెంట్లలోనూ సందడి చేస్తున్నాడు.
అలా ఒకేసారి ఎంటర్టైన్మెంట్ షోలు, స్పెషల్ ఈవెంట్లు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు.. ఇప్పుడు 'సామీ రారా' అనే వినాయక చవితి స్పెషల్ ఈవెంట్లో సందడి చేశాడు. ఇది ఈటీవీలో ప్రసారం కానుంది. తాజాగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను మూవీటీమ్ రిలీజ్ చేసింది. ఈ ఈవెంట్‌కు సీనియర్ నటుడు నరేశ్-పవిత్రా లోకేశ్ స్పెషల్ గెస్ట్లుగా హాజరై సందడి చేశారు. బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి తన ఎనర్జీ పెర్ఫార్మెన్స్తో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. హైపర్ ఆదితో పాటు పలువురు కమెడియన్స్ పాల్గొని షోలో నవ్వులు పూయించారు.
Hyper Aadi comments on Naresh Married Three Times : అయితే ప్రోమోలో హైపర్ ఆది.. నరేశ్ మూడు పెళ్లిళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవిత్రా పక్కనే ఉన్నప్పటికీ 'నాకు ఒక్క పెళ్లే అవ్వట్లేదు.. మీకు పెళ్లి, మళ్లీ పెళ్లి? ఎలా సార్' అంటూ నరేశ్‌ను సరదాగా ప్రశ్నించాడు. అయితే ఈ కామెంట్స్‌కు నరేశ్, పవిత్రా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇంతకీ ఏం సమాధానం ఇచ్చారనేది ప్రోమోలో రివీల్ చేయలేదు. ప్రస్తుతం అది ఆసక్తికరంగా మారింది.