Nara Rohit Prathinidi 2 : నారా వారి ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తన కొత్త సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు.
సూపర్ కంటెంట్‌తో 2014లో పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి' సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా 'ప్రతినిధి 2'తో నారా రోహిత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు' అని క్యాప్షన్ రాసుకొచ్చారు'.
గతంలో 'ప్రతినిధి' మంచి కథ, గ్రిప్పింగ్ కథనంతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో హీరో రోహిత్ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే ఓ బాధ్యతాయుతమైన యువకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. కాగా సోమవారం తాజాగా విడుదలైన పోస్టర్‌ను చూస్తుంటే.. మళ్లీ ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయని అంటున్నారు నారా వారి ఫ్యాన్స్.