Nara Rohit 19 Movie Update : 'బాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. 'సోలో' సినిమాతో యువ అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్. కథల విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిరుచి కలిగిన నటుడు. 'సోలో', 'ప్రతిధ్వని', 'రౌడీ ఫెలో', 'అసుర', 'జ్యో అచ్యుతానంద' తదితర విజయాలు అందుకున్నారు నారా రోహిత్. ఇప్పటివరకు ఈ యువహీరో 18 చిత్రాలను నటించారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు నారా రోహిత్.
పొలిటికల్ టచ్‌తో నారా రోహిత్ కొత్త సినిమా.. టార్గెట్ వారే! - నారా రోహిత్ 19వ చిత్రం
Nara Rohit 19 Movie Update : విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. కొన్నాళ్ల నుంచి ఈ యువ హీరో సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 19 చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. మరెందుకు ఆలస్యం మీరు ఆ పోస్టర్‌ను చూసేయండి.
తాజాగా వానరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నారా రోహిత్ తన 19వ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జులై 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పోస్టర్‌ను చూస్తే పొలిటికల్ టచ్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో 'ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు' అని ఉంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, నారా రోహిత్ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరికొందరు ఈ సినిమా ప్రతినిధికి సీక్వెల్ అని కామెంట్లు పెడుతున్నారు. 2024 ఏపీ శాసససభ ఎన్నిసభ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలవ్వనుండడం వల్ల పొలిటికల్ డ్రామా అని మరికొందరు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్. 2009లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విమర్శకుల మెప్పు పొందింది. నటుడిగా రోహిత్ ప్రతిభేంటో ఆ చిత్రంతో తెలిసింది. దాంతో ఆయనకు వరుసగా అవకాశాలొచ్చాయి. వేగంగా సినిమాలు చేయడంలో రోహిత్ దిట్ట. 2016, 2017లో 'తుంటరి', 'సావిత్రి', 'రాజా చెయ్యి వేస్తే', 'జ్యో అచ్యుతానంద', 'శంకర', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'శమంతకమణి', 'కథలో రాజకుమారి', 'బాలకృష్ణుడు' చిత్రాల్లో నటించారు రోహిత్. 'వీరభోగ వసంతరాయలు', 'ఆటగాళ్లు'’ చిత్రాల్లోనూ నటించి సందడి చేశాడు. 'బాణం' లో సన్నగా కనిపించిన రోహిత్, ఆ తర్వాత కాస్త బొద్దుగా మారారు. 'బాలకృష్ణుడు' చిత్రంలో మళ్లీ నాజూగ్గా కనిపించారు.