తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆస్కార్​ రేసులో నాని, సాయిపల్లవి సినిమా - నాని శ్యామ్ సింగరాయ్​ ఆస్కార్ నామినేషన్స్​

Shyamsingha roy Oscar nominations నేచురల్​స్టార్​ నాని, సాయిపల్లవి నటించిన శ్యామ్​సింగరాయ్​ సినిమాకు అరుదైన గౌరవం దక్కే అవకాశం లభించింది. ఈ మూవీ మూడు విభాగాల్లో ఆస్కార్​ నామినేషన్​ రేసులో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

Shyamsingha roy Oscar nominations
ఆస్కార్​ రేసులో నాని, సాయిపల్లవి సినిమా

By

Published : Aug 17, 2022, 9:16 PM IST

Shyamsingha roy Oscar nominations నేచురల్​స్టార్​ నాని ఓ అరుదైన ఘనత సాధించేందుకు కాస్త దూరంలో ఉన్నారు. రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి నటించిన సినిమా శ్యామ్​సింగరాయ్​. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి నటన, గెటప్​కు అభిమానులు మరింత ఫిదా అయ్యారు.

అయితే తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆస్కార్​ నామినేషన్​ రేసులో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. మూడు విభాగాల్లో ఈ సినిమాను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. క్లాసికల్​ కల్చరల్ డ్యాన్స్​, పీరియాడిక్ ఫిల్మ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. మూడు విభాగాల్లో ఈ సినిమా ఎంపిక అయ్యిందని సమాచారం.

దీంతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్​గా మారింది. ఈ మూడు విభాగాల్లో ఏదో ఒక విభాగానికైనా అవార్డు వచ్చిందా.. టాలీవుడ్ ఖ్యాతి మరో మెట్టు ఎక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నాని, సాయిపల్లవికి కంగ్రాట్స్​, ఆల్​ ది బెస్ట్​ అంటూ కామెంట్స్​ పెడుతున్నారు. సినిమాకు అవార్డు రావాలని కోరుకుంటున్నారు. ఇటీవలే ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ నిలిచినట్లు కూడా వార్తలు వచ్చాయి. 'ఆర్​ఆర్​ఆర్​'లో ఆయన నటనకుగాను ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం సాగింది. కాగా, నాని ప్రస్తుతం 'దసరా' సినిమాలో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ ఆదివాసి నటికి 50ఏళ్ల తర్వాత ఆస్కార్​ క్షమాపణ, ఏం జరిగిందంటే

ABOUT THE AUTHOR

...view details