Nani New Movie Glimpse :కొత్త తరహా కథలతో అలరించే నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'అంటే.. సుందరానికీ' ఫేమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ్‌తో నాని మరోసారి జతకట్టాడు. ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందనుంది. అయితే దసరా పండగను పురస్కరించుకొని మూవీయూనిట్ ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చింది. సినిమాకు 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఖారారు చేస్తూ.. ఫస్ట్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేసింది. 2.48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్న ఈ గ్లింప్స్ మీరు చూశారా?
గ్లింప్స్‌లో ఏముంది?.. 'రాజుకైనా బంటుకైనా ఎలాంటి వారకైనా ఒకరోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురుచూడాలి' అంటూ సీనియర్ హీరో సాయి కుమార్ వాయిత్తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో హీరో నాని పాత్ర పేరు సూర్య. అయితే సూర్య ఓ షెడ్లో గొలుసులతో బందీగా ఉంటూ తన టైమ్ వచ్చే దాకా వెయిట్ చేస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. అలా తమతమ టైమ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఓ రోజంటూ వస్తే.. ఆ రోజు శనివారమైతే సరిపోదా? అని టైటిల్‌ను బ్యాలెన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో నాని మాస్ లుక్‌లో కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. విలన్‌పై పగతో రగిలిపోతున్న హీరో.. ఎలాగోలా గొలుసులు తెంచుకొని.. షెడ్ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడన్నదే అసలు కథ!