తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మార్చి నెలలోనే 'దసరా'.. 700 స్క్రీన్స్​పై 'నాని' మేజిక్! - nani dasara release

నేచురల్​ స్టార్​ నాని నటించిన పాన్​ ఇండియా మూవీ దసరా. శ్రీకాంత్​ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్​కు ముందే నెట్టింట సంచలనం క్రియేట్​ చేస్తోంది. ఎందుకంటే..

nani-keerthy-suresh-dasara-to-be-released-in-700-locations
nani dasara

By

Published : Mar 8, 2023, 1:52 PM IST

నేచురల్ స్టార్ నాని అభిమానులకు మార్చి నెలలోనే 'దసరా' పండుగ రానుంది. మార్చి 30న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకుంది. తెలంగాణలోని గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్​ తెరంగేట్రం చేస్తున్నారు. రంగస్థలం, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలకు అస్టిటెంట్​ డెరెక్టర్​గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్​ పట్టారు. ఇందులో ధరణి అనే పాత్రలో నాని నటించగా.. వెన్నెలగా కీర్తి సురేష్ కనిపించనుంది. మరోవైపు ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో ప్రతినాయకుని పాత్ర పోషించారు.

అయితే రీసెంట్​గా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పాటలతో పాటు టీజర్​తో పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న ఈ సినిమా.. అమెరికాలోనూ ఓ రేంజ్‌లో విడుదల అవ్వనున్నందట. సినీ వర్గాల సమచారం ప్రకారం అక్కడ ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లోనూ సుమారు 700+ లొకేషన్‌లలో ప్రీమియర్ షోలు నడపనుందట.

ఇక భారీ అంచనాల నడుమ వస్తోన్న 'దసరా' నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా.. మూడో సింగిల్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూడో పాట మార్చి 8న విడుదల కానున్నట్లు తెలిపింది టీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్​ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఆయనే సొంతం చేసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల హక్కులను ఆయన రూ.28 కోట్లకు కొనుగోలు చేశారట.

అయితే పెరుగుతున్న డిమాండ్‌ను చూసుకుంటే తెలుగు రాష్ట్రాలల్లో వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా రూ.40 కోట్ల మేరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను చదలవాడ శ్రీనివాస్ విడుదలకు రెండు నెలల ముందే రూ.24 కోట్ల రేంజ్ రేటుకు సొంతం చేసుకోగా.. ఆయన దగ్గర నుంచి నిర్మాత దిల్ రాజు రూ.28 కోట్ల మేర చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైవు దీని నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట.

ఇక సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలక పాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటించారు. అంతే కాకుండా సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్​ కూడా స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ముంబయిలో దసరా ప్రమోషన్స్​లో నాని

ముంబయిలో 'దసరా' ప్రమోషన్స్​..
తన సినిమా ప్రమోషన్స్​లో బిజీ బిజీగా ఉంటున్న నేచురల్​ స్టార్​ నాని మంగళవారం ముంబయికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి అభిమానులతో ముచ్చటించిన నేచురల్​ స్టార్​ వారితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. నానిని చూసిన నార్త్​ ఫ్యాన్స్​ ఎంతో ఖుష్​ అయ్యారు. మార్చి 30న విడుదలకు సిద్దం కానున్న సినిమాకు ఆల్ ద బెస్ట్ అంటూ అభినందనలు తెలిపారు.

దసరా మూవీ ప్రమోషన్స్​లో నాని
ఫ్యాన్స్​తో సెల్ఫీ దిగుతున్న నాని

ABOUT THE AUTHOR

...view details