Nani Hi Nanna Movie : టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఇటీవలే వచ్చిన టీజర్, సాంగ్స్‌తో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'సమయమా', 'గాజు బొమ్మ' అనే రెండు పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోగా.. తాజాగా 'అమ్మాడి' అనే మూడో పాటను ఓ కాలేజ్ ఈవెంట్లో మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు వెళ్లిన మూవీ టీమ్..అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించింది.
ఇక హీరో నాని కూడా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అని ఓ స్టూడెంట్ నానిని ప్రశ్నించారు. దానికి నాని తన స్టైల్లో కూల్‌గా సమాధానం చెప్పారు.
"మీరు అనుకుంటే ఇంకా పెద్ద హీరో సినిమాలు చూసేందుకు వెయిట్ చేయవచ్చు. నా కోసమే ఎందుకు థియేటర్‌కు వస్తున్నారు. మనసుకు నచ్చిన పని చేసుకుంటూ మనం వెళ్లిపోతున్నాం. అలాగే మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు. నేనూ అంతే" అని నాని చెప్పారు.