Hai Nanna Third Single Ammadi Song : నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం 'హాయ్ నాన్న' రిలీజ్ డేట్ దగ్గర పడటం వల్ల... చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ముఖ్యంగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను బాగా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు థర్డ్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేసింది.
మృణాల్ ఠాకూర్ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్‌తో మొదలైన ఈ పాటలో మృణాల్ ఎంతో క్యూట్‌గా కనిపించింది. తన భర్తగా నటించిన నాని గురించి చెబుతూ.. తామిద్దరి మధ్య బంధం ఎంత ప్రేమగా ఉంటుందో లిరిక్స్ రూపంలో చెప్పుకొచ్చింది. పెళ్లైన రోజు నుంచి తామిద్దరి మధ్య గడిచిన అద్భుత ప్రయాణం, జరిగిన సంఘటనల గురించి చెబుతూ వివరించింది. అలా ఈ పాట మొత్తం నాని మృణాల్ మధ్య ఉన్న స్వీట్ అండ్ రొమాంటిక్ సీన్స్‌తో సాగింది. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ క్యాచీ, మీనింగ్ ఫుల్‌గా అనిపించాయి. కాలా భైరవ, శక్తి శ్రీ గోపాలన్ ఆలపించిన తీరు ఎక్స్‌ప్రెస్సివ్‌గా ఉంది. హేషన్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం కూడా ఎంతో వినసొంపుగా ఉంది.