Nani Hai Nanna Release Date : నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా 'హాయ్ నాన్న' టీజర్ రిలీజ్ అవ్వడంతో పాటు మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చింది. అయితే నిజానికి ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇప్పుడీ చిత్రం ప్రీ పోన్ అయింది. ముందుగా అనుకున్న విడుదల షెడ్యూల్ కన్నా 2 వారాల ముందే రిలీజ్ కానుంది. డిసెంబర్ 7నే థియేటర్లలో ప్రేక్షకలను పలకరిం రానున్నట్లు మేకర్స్ తెలిపారు.
ప్రభాస్ సలార్ ఎవరూ ఊహించని విధంగా క్రిస్మస్ బరిలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇతర చిత్రాల విడుదల తేదీలు మారిపోయాయి. ముఖ్యంగా క్రిస్మస్ పోటీల్లో ఉన్న నాని 'హాయ్ నాన్న', వెంకటేశ్ 'సైంధవ్' ప్రీపోన్-పోస్ట్‌పోన్ అయిపోయాయి. సైంధవ్ సంక్రాంతికి వెళ్లిపోగా.. హాయ్ నాన్న 2 వారాల ముందుగా వచ్చేస్తోంది. అయితే నాని హాయ్ నాన్న.. డిసెంబర్ 7న రానుండటం వల్ల.. బాక్సాఫీస్ ముందు మరో కొత్త పోటీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేంటంటే.. ఇప్పటికే ఆ రిలీజ్ డేట్‌కు ఒక రోజు తర్వాత.. మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఆపరేషన్ వాలంటైన్'(Operation Valentine Varun Tej), నితిన్ నటిస్తున్న 'ఎక్స్ ట్రా ఆర్డినరీ'(Nithin Extraordinary Man Movie) వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఈ విషయాన్ని అనౌన్స్ కూడా చేశాయి.