తన టాలెంట్ యాక్టింగ్ స్కిల్స్‌తో నాచురల్ స్టార్‌గా ఎదిగారు నాని. మీడియం రేంజ్ హీరోగా ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ఈ సారి పాన్ ఇండియా చిత్రం 'దసరా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాబోతున్నారు. నాని కెరీర్లోనే డిఫరెంట్ జానర్‌గా.. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిందీ సినిమా. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటించింది. మరో రోజులో మార్చి 30న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైనా నాని, కీర్తి లుక్స్, ప్రచార చిత్రాలు.. సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. సినీ ప్రేక్షకులు, నాని అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో మూవీటీమ్.. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని నిర్ణయించింది. కథకు ఉన్న మంచి డిమాండ్ రావడంతో నిర్మాణ సంస్థ భారీగా ఖర్చు చేసినట్లు తెలిసింది. క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టిందట. ఇక సినిమాను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణాలో అత్యధిక థియేటర్‌లలో విడుదల చేయనుందట. 1300కు పైగా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
అలా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా 3 వేలకు పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మూవీటీమ్ సిద్ధమైంది. ఇప్పటివరకూ అతి తక్కువ సినిమాలు మాత్రమే 3 వేలు అంతకన్నా ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాయి. 'బాహుబలి సిరీస్, సైరా, సాహో, రాధేశ్యామ్, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, లైగర్.. ఇప్పటివరకూ అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ అయిన తెలుగు చిత్రాలుగా రికార్డుకెక్కాయి. ఇప్పుడీ జాబితాలో నాని మూవీ కూడా చేరనుంది.