తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఊరమాస్ లుక్​లో నాని.. 'దసరా' ట్రైలర్​ అదిరిపోయిందిగా! - నాని దసరా రిలీజ్​ డేట్

నేచురల్​ స్టార్​ నాని హీరోగా పాన్​ ఇండియా మూవీగా వస్తున్న చిత్రం 'దసరా'. ఇప్పటికే టీజర్​, పాటలతో మంచి క్రేజ్​ సంపాదించుకున్న ఈ చిత్రం నుంచి మరో అప్​డేట్​ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను రిలీజ్​ చేసింది చిత్ర బృందం.

nani dasara trailer
nani dasara trailer

By

Published : Mar 14, 2023, 5:18 PM IST

Updated : Mar 14, 2023, 5:48 PM IST

Nani Dasara Trailer : నేచురల్ స్టార్​ నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'దసరా' మూవీ ట్రైలర్​ విడుదలైంది. పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను రిలీజ్​ చేసింది చిత్ర బృందం. ఊర మాస్​ లుక్​లో నాని అదరగొట్టారు. తెలంగాణలోని ఓ బొగ్గు గనిలో జరిగిన కథాంశంతో వస్తుంది సినిమా. ఈ సినిమా ట్రైలర్​ను 'చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ' బతుకమ్మ పాటతో మొదలుపెట్టింది చిత్ర యూనిట్​. హీరోయిన్ కీర్తి సురేశ్​ పెళ్లి కూతురుగా ముస్తాబై.. 'ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా' అంటూ ముద్దుగా డైలాగ్ చెప్పింది. ఈ క్రమంలోనే బొగ్గు గనిలో జరుగుతున్న యాక్షన్​ సన్నివేశాలు సూపర్​గా ఉన్నాయి.

ఇప్పటికే సినిమా ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు హీరో నాని. ఇటీవలే హోలీ సందర్భంగా ముంబయిలోని జూహుకు వెళ్లాడు. అంతకుముందు ట్రైలర్​ రిలీజ్ డేట్​ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్​ సైతం అభిమానులను ఆకట్టుకుంది. రావణాసురుడి భారీ విగ్రహాం మండుతుండగా.. దానికి ఎదురుగా నిలబడి చేతిలో రెండు గొడ్డళ్లు పట్టుకుని ఊర మాస్​ లుక్​లో కనిపించాడు నాని. హీరో నాని కూడా 'జాతర షురూ' అంటూ తన సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాడు.

కొత్త డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవెల్​లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో నేచురల్​ స్టార్​ నాని సరసన కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. కాగా మరో ముఖ్య పాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటించారు. ఇక తమిళ స్టార్ నటుడు​ సముద్రఖనితో పాటు జరీనా వహాబ్, సాయి కుమార్​ కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్​ నారాయణ్​​ మ్యూజిక్​ అందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 30న విడుదల కానుంది.

తన మొదటి పాన్​ ఇండియా సినిమా కావడం వల్ల హీరో నాని దగ్గరుండి సినిమా ప్రమోషనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఇటీవలే హోలీ సందర్భంగా ముంబయిలోని జూహుకు వెళ్లి.. అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు రిలీజైన మూడు పాటలకు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్​తో అభిమానుల్లో ఆసక్తి ఇంకా పెరిగింది.

ఇవీ చదవండి :'ఈ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమే'.. వాళ్లిద్దరికి సమంత థ్యాంక్స్​

తన అందానికి కారణం అదేనట..! గ్లామర్ సీక్రెట్ బయటపెట్టిన అల్లు అర్జున్​ భార్య

Last Updated : Mar 14, 2023, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details