Srikanth Odhela Marriage : కొంతమంది డైరెక్టర్స్.. తమ తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్‌ను అందుకుంటారు. తమ ఫస్ట్ మూవీతోనే సక్సెస్‌ను అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతారు. అలాంటి వారిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' సినిమాతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుని.. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్ర విజయోత్సాహంలో తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టారు శ్రీకాంత్. మరో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
Srikanth Odela married : గోదావరిఖని వేదికగా.. తన చిన్ననాటి స్నేహితురాలు సౌమ్యకృష్ణను బుధవారం పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధువులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. దర్శకుడు సుకుమార్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరై సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే హీరో నాని మాత్రం ఈ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయారు. వేరే రాష్ట్రంలో తన కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల శ్రీకాంత్ పెళ్లికి నాని హాజరుకాలేకపోయారని సమాచారం. కానీ ఈ వేడుకకు సంబంధించి నూతన వధూవరుల ఫొటోను హీరో నాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'మన శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు. మీ ఆశీస్సులు పంపండి' అని తన అభిమానులను కోరారు. ఈ పిక్‌లో కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా కనిపించింది. దీంతో, నూతన దంపతులకు నాని ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.