కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచరుల్ స్టార్ నాని-హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మార్చి30న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కలెక్షన్స్.. బాలీవుడ్ సూపర్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ నటించిన 'భోలా' మూవీపై ప్రభావం పడనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి రిలీజ్‌కు ముందు నుంచే 'దసరా'కు ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే నాని, కీర్తిసురేశ్.. మాస్ యాక్షన్ పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ బాగా ఆకట్టుకోవడంతో.. సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మార్చి 30న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1300 స్క్రీన్‌లలో ప్రదర్శన కానుందని తెలిసింది. ఉదయం 5 గంటల నుంచే షోలు వేయనున్నారట. నాని కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్. అయితే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్.. రూ.50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. ఇది మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
అయితే మార్చి 30నే బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ నటించిన 'భోలా' కూడా థియేటర్లలో విడుదల కానుంది. తమిళ హీరో కార్తి హీరోగా నటించిన 'ఖైదీ'కి రిమేక్‌గా రూపొందింది. అయితే ఈ చిత్రానికి ఇక్కడ అంతగా బజ్ క్రియేట్ కాలేదనే చెప్పాలి! ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలో అజయ్ దేవగణ్ మాస్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ.. దానిని బాలకృష్ణ 'అఖండ'తో పోల్చారు. అలా ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ రూ.1.15కోట్లు వచ్చినట్లు తెలిసింది. అలా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో డౌన్ అయిన ఈ సినిమాకి.. నాని 'దసరా' ఎఫెక్ట్ గట్టిగా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్న నేపథ్యంలో.. ఒకవేళ దసరాకు మంచి టాక్ వస్తే.. భోలాకు గట్టి పోటీ తప్పదు. అయితే ఈ అడ్వాన్స్ బుక్సింగ్ కలెక్షన్స్ వివరాల పక్కా స్పష్టత ఏమీ లేదు.
కాగా, ఇటీవలే ఈ విషయంపై నాని కూడా మాట్లాడారు. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలన్నింటినీ ఎంతో కష్టపడి చేసినట్లు తెలిపారు. ఓ చిత్రాన్ని చేస్తున్నప్పుడు ప్రేక్షకుని స్థానంలో ఉండి చేస్తానని పేర్కొన్నారు. అజయ్ దేవగన్ అంటే తనకు అభిమానమని.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి సినీ ప్రేక్షకుడు.. రెండు చిత్రాలను ఆదరించాలని కోరారు.
ఇదీ చూడండి:వెంకటేశ్ 'సైంధవ్' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు బాక్సాఫీస్ బద్దలే