తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాక్ ఆఫ్​ ది టౌన్​గా నాని 'మూవ్​ ఆన్' స్ట్రాటజీ! - నానిపై అభిమానులు ప్రశంసలు

Nani 30 movie updates : నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా కోసం ఫాలో అవుతున్న మూవీ ఆన్ స్ట్రాటజీపై అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు..

nani 30
టాక్ ఆఫ్​ ది టౌన్​గా నాని 'మూవ్​ ఆన్' స్ట్రాటజీ

By

Published : Jul 10, 2023, 10:21 AM IST

Updated : Jul 10, 2023, 10:38 AM IST

Nani 30 movie updates : నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రియులకు చెప్పాల్సిన పనిలేదు. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించి ఎంతో మంది అమ్మాయిలను, ఫ్యామిలీ ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. 'అష్టా-చమ్మా' చిత్రంతో అలరించినా, 'అంటే సుందరానికి!' అంటూ నవ్వించినా, 'శ్యామ్‌ సింగరాయ్‌'తో భావోద్వేగానికి గురి చేసినా... అది ఆయనకే చెల్లింది. ఇటీవలే 'దసరా' చిత్రంతో తన రూటు మార్చి.. తనలోని పక్కా మాస్ యాక్టింగ్​ను బయటపెట్టారు.

శారీరకంగా, మానసికంగా ఈ 'దసరా' చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. చిత్రాన్ని ఆడియెన్స్​లోకి తీసుకెళ్లేందుకు నార్త్ టు సౌత్ అన్ని చోట్లా డే అండ్ నైట్​ ప్రమోషన్స్​లోనూ గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉన్నారు. చివరికి తన కెరీర్​లోనే బిగ్గెస్ట్​ గ్రాసర్​ను అందుకుని రూ.100 కోట్ల భారీ విజయాన్ని అందుకున్నారు.

సాధారణంగా ఇంతటి భారీ గెలుపును సాధించినప్పుడు.. ఏ హీరో అయినా కాస్త విరామం తీసుకుని.. ఆ సక్సెస్​ను ఎంజాయ్​ చేస్తుంటారు. ప్రశంసలను అందుకుంటూ వాటిని ఆస్వాదిస్తారు. ఆ తర్వాతే తమ కొత్త చిత్రానికి సంబంధించిన పనులపై దృష్టి సారిస్తారు. కానీ హీరో నాని మాత్రం అస్సలు అలా చేయలేదు. ఆ వెంటనే కొత్త సినిమాను ప్రకటించేశారు. కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా తన 30వ సినిమా కోసం పనిచేయడం ప్రారంభించేశారు.

ప్రస్తుతం దాన్ని పూర్తి చేసే పనుల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు. త్వరలోనే ఈ ప్రచార చిత్రం రాబోతుందని పేర్కొన్నారు. ఇక ఇది చూసిన ఆయన అభిమానులు, సినీ ప్రియులు.. నానికి వృత్తి పట్ల ఉన్న కమిట్​మెంట్​, ప్యాషన్​ చూసి తెగ ప్రశంసిస్తున్నారు. ఫిజికల్​, మెంటల్​ ఛాలెంజ్​తో కూడుకున్న​ 'దసరా' లాంటి భారీ సినిమా చేసినప్పటికీ..​ ఆ తర్వాత కాస్త కూడా రెస్ట్ తీసుకోకుండా.. సమయం వృథా చేయకుండా.. సినిమా రిజల్ట్​ నుంచి మూవ్​ ఆన్​ అయిపోయి.. కొత్త సినిమా కోసం పనిచేస్తున్నారని పొగడ్తలు కురిపిస్తున్నారు. నాని 'మూవ్​ ఆన్ స్ట్రాటజీ' ఫాలో అవుతున్నారని అంటున్నారు.

Nani 30 cast and crew కాగా, నాని 30వ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డా.విజయేందర్‌రెడ్డి తీగల, మూర్తి.కె.ఎస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'సీతారామం' బ్యూటీ మృణాల్​ ఠాకూర్​ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం కోసం ఆమె రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్​ అందుకుందట. ఈ సినిమాతో సౌరవ్‌.. డైరెక్టర్​గా ఇంట్రడ్యూస్ కానున్నారు. తండ్రి కూతుళ్ల నేపథ్యంలో సినిమా రానుంది.

Last Updated : Jul 10, 2023, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details