తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు కల్యాణ్​ రామ్ ఫోన్​ కాల్​.. ​బాలయ్య సూపర్​ హిట్​ సాంగ్​తో సర్​ప్రైజ్​..

నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌.. తన ఫ్యాన్స్​కు కాల్​ చేసి సర్​ప్రైజ్ ఇచ్చారు. అమిగోస్​ సినిమా గురించి వివరించారు. ఆ సంగతులు..

kalyan ram phone call to fans
ఫ్యాన్స్​కు కల్యాణ్​ రామ్ ఫోన్​ కాల్​.. ​బాలయ్య సూపర్​ హిట్​ సాంగ్​తో సర్​ప్రైజ్​..

By

Published : Jan 25, 2023, 3:22 PM IST

నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌ నటిస్తోన్న సరికొత్త చిత్రం అమిగోస్‌. రాజేంద్ర రెడ్డి దర్శకుడు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఇందులో భాగంగా అభిమానులతో కల్యాణ్‌రామ్‌ ఫోన్‌కాల్‌ మాట్లాడిన ఓ వీడియోను బుధవారం షేర్‌ చేసింది.

ఇందులో అమిగోస్​ టైటిల్​కు అర్థం చెప్పారు కల్యాణ్​. దీంతో పాటే ఈ సినిమా క్లాస్​ లేదా మాస్​ ఏంటా అన్నది వివరించారు. అలాగే బాలయ్య నటించిన సినిమాల్లోని ఓ సూపర్‌హిట్‌ సాంగ్‌ను ఈ సినిమాలో రీమేక్‌ చేస్తున్నట్లు తెలిపారు.

కాగా ఈ సినిమాలో ఆశికా రంగనాథ్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్​, సాంగ్స్​, టీజర్​ విడుదలై ఆకట్టుకుంటున్నాయి.ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథగా రూపొందిన చిత్రమిది. కల్యాణ్‌రామ్‌ ఇందులో మంజునాథ్‌, సిద్ధార్థ్‌, మైఖేల్‌ అనే మూడు పాత్రల్లో సందడి చేశారు. వీటిలో మైఖేల్‌ పాత్రను ప్రతినాయక ఛాయలున్న పాత్రలా ప్రచార చిత్రంలో చూపించారు. అందులో కల్యాణ్‌రామ్‌ ఆహార్యం.. ఆయన పలికించిన హావభావాలు, చేసిన యాక్షన్‌ హంగామా ఆసక్తి రేకెత్తించాయి. మరి అతనికి.. మంజునాథ్‌, సిద్ధార్థ్‌ పాత్రలకు మధ్య సాగే పిల్లి ఎలుకా ఆట ఏంటనేది తెరపై చూసి తెలుసుకోవాలి. సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌రాజన్‌.

ఇదీ చూడండి:Pathaan: షారుక్​ ఫ్యాన్స్​ హంగామా.. భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ..

ABOUT THE AUTHOR

...view details