విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి రెండో తరంలో బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా వచ్చారు. అగ్ర కథానాయకులుగా తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇప్పుడు మరో ఎన్టీఆర్ మనవడు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. హీరో ఫస్ట్ లుక్ అదిరిందిగా! - చైతన్యకృష్ణ బ్రీత్ మూవీ
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు వస్తున్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ.. హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన టైటిల్, హీరో ఫస్ట్ లుక్‌ను కథానాయకుడు కల్యాణ్‌రామ్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ.. హీరోగా ఓ సినిమా ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కొన్నాళ్ల క్రితం చైతన్య కృష్ణ కొన్ని సినిమాలు చేశారు. కాస్త విరామం తర్వాత మళ్లీ ఆయన హీరోగా లాంఛ్ అవుతున్నారు. తాజాగా చైతన్య కృష్ణ.. కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. బసవతారకం క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా నందమూరి చైతన్య కృష్ణ హీరోగా రూపొందుతోన్న సినిమాకు 'బ్రీత్' టైటిల్ ఖరారు చేశారు. 'అంతిమ పోరాటం'... అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. చైతన్య కృష్ణ ఫస్ట్ లుక్‌ను హీరో నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు.
అయితే చైతన్య కృష్ణ లుక్ చూస్తుంటే.. కమర్షియల్ సినిమాతో కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, చైతన్య కృష్ణ ఎంట్రీ ఓకే గానీ.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం ఎదురూచూస్తున్నట్లు నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 'రక్ష', 'జక్కన్న' సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల.. నందమూరి చైతన్య కృష్ణ బ్రీత్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ ఈ చిత్రానికిి బాణీలు అందిస్తున్నారు.