తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆహా'లో మరోసారి బాలయ్య రోర్​.. ఇక షో దద్దరిల్లాల్సిందే! - బాలకృష్ణ ఆహా గెస్ట్​

ప్రముఖ ఓటీటీ ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ.. మరోసారి తన అభిమానులను పలకరించనున్నారు. ఆయనతో కలిసి ఫ్యాన్స్​ను సర్​ప్రైజ్ చేసేందుకు సిద్ధమైంది ఆహా. ఆ సంగతులు..

nandamuri balakrishna will once again on aha as guest
nandamuri balakrishna will once again on aha as guest

By

Published : Mar 12, 2023, 7:36 PM IST

తెలుగు అగ్ర హీరోలంతా వెండి తెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా మెరిసి ఔరా అనిపించారు. బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, నాని, నాగార్జున వంటి స్టార్​ హీరోలు పలు టీవీ షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అందరినీ అబ్బురపరిచారు. అలాగే ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ వచ్చాక కూడా బాలకృష్ణ, రానా, సమంత, మంచు లక్ష్మి వంటి నటీనటులు హోస్టులుగా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అయితే వీరందరిలో ఎక్కువ పేరు వచ్చింది మాత్రం బాలయ్యకే. అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్​ ఆహా రూపొందించిన అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లకు హోస్టుగా బాలయ్య అదరగొట్టారు. బాలయ్య వల్లే ఈ టాక్ షో ఎంతంటి ఘన విజయం సాధించిందని చొప్పొచ్చు.

బాలయ్య తన మార్క్ ప్రశ్నలతో వచ్చిన అతిధులను ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే రేటింగే కాదు ఆహాకు సబ్ స్రైబర్లను కూడా పెంచిందీ ఈ షోనే. కాగా, అన్​స్టాపబుల్​ విత్​ బాలయ్య షో రెండు సీజన్లు ముగిశాయి. ఈ రెండు సీజన్లలో టాలీవుడ్ హీరో, హీరోయిన్లు ప్రభాస్, మహేశ్​ బాబు, పవన్ కల్యాణ్, రానా, నాని, అల్లు అర్జున్, రష్మిక, రాశిఖన్నా, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి యాక్టర్లు ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. కేవలం బాలయ్య బ్రాండ్ ఇమేజ్‌తోనే ఈ షో పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మరోసారి బాలయ్య ఓటీటీలో సందడి చేయనున్నారు.

అయితే అన్​స్టాపబుల్ సీజన్ 3 అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. బాలయ్యకు ఉన్న ఇమేజ్​ను దృష్టిలో పెట్టుకుని ఆహా పకడ్బందీ ప్లాన్ వేసింది. మరోసారి బాలయ్యను మరో షో ద్వారా తీసుకు రానుంది. ఆహాలో ప్రసారం కాబోతున్న మ్యూజిక్ కాంపిటీషన్ షో ‘ఇండియల్ ఐడల్ సీజన్ 2 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆడిషన్స్ కూడా జరిగాయి. మొత్తం 12 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసింది. వీరి మధ్య పోటీ ఉండనుంది. తమన్, గీతామాధురి, కార్తీక్ ఈ ఆడిషన్స్ నిర్వహించారు. అయితే ఈ సీజన్ బాలయ్యతో ప్రారంభించేందుకు ఆహా స్కెచ్ వేసింది. ఈ 12 మందిని తెరకు పరిచయం చేసే బాధ్యతను బాలకృష్ణకు అప్పగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, దానికి సంబంధించిన వీడియోను ఆహా ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇక బాలయ్య హోస్టు అయినా గెస్ట్ అయినా ఆ షో దద్దరిల్లాల్సిందే. అయితే బాలయ్య ఇండియన్​ ఐడల్​ సీజన్​ 1కు కూడా వచ్చి సందడి చేశారు. తనదైన పంచ్​ డైలాగ్​లతో అందరినీ నవ్వించారు.

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్​లను సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NBK 108 అనే వర్కింగ్ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్​ అగర్వాల్​ హీరోయిన్​గా నటించనుందట. కాగా, ఇటీవలే షూటింగ్​లో శ్రీలీల పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. బాలకృష్ణకు ఆమె కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరితో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నాయట. వీరి మధ్య వచ్చే సెంటిమెంట్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయంటున్నారు. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే చిత్ర టైటిల్​ను ప్రకటించి..విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details