Balakrishna Corona: సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించారు. రెండ్రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించిన బాలకృష్ణ.. త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా - బాలకృష్ణకు కరోనా
17:26 June 24
నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా
ఇక సినిమాల విషయానికొస్తే, 'అఖండ' విజయంతో బాలకృష్ణ జోరుమీదున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయిక. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు వ్యాఖ్యాతగానూ బాలకృష్ణ మరోసారి అలరించనున్నారు. 'అన్‌స్టాపబుల్ సీజన్-2'తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవీ చూడండి:బాలయ్య సినిమాలో రాజశేఖర్.. విలన్‌గా కాదు ఆ పాత్రలో!
బాలయ్య 'అన్‌స్టాపబుల్' సీజన్-2 రెడీ.. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్