తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఐదు సినిమాలు లైన్‌లో పెట్టిన బాలయ్య!.. మామూలు స్పీడ్ కాదుగా ఇది!! - బాలకృష్ణ అనిల్ రావిపూడి

Balakrishna Upcoming Movies : నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో మంచి ఊపు మీదున్నారు. ఓవైపు అనిల్ రావిపూడితో NBK108 చిత్రంలో నటిస్తున్న బాలయ్య.. మరోవైపు వరుస చిత్రాలకు సైన్ చేస్తున్నారట. దీంతో ఇప్పటికే ఆయన లైనప్‌లో ఐదు సినిమాలు ఉన్నాయట. ఆ సంగతులు..

balakrishna new movies
balakrishna new movies

By

Published : Jun 7, 2023, 8:00 PM IST

Balakrishna Upcoming Movies : నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరసింహారెడ్డి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి.. డైలాగ్స్, మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చారు. ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడితో NBK108 చిత్రంలో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్, శ్రీలీల ఫిమేల్ లీడ్స్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా సంగతి పక్కనపెడితే బాలయ్య అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్​ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారట. NBK108 సహా ప్రస్తుతం బాలయ్య చేతిలో ఐదు చిత్రాలు ఉన్నాయట.

మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న NBK108 దసరాకు విడుదల కానుంది. దీంతో షూటింగ్ పార్ట్ త్వరగా పూర్తి చేసి, వెంటనే నెక్ట్స్ మూవీని సెట్స్‌పైకి తీసుకు రావాలనుకుంటున్నారు బాలయ్య. ఈ మేరకు వాల్తేర్ వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీతో మాస్ ఎంటర్‌టైనర్‌కు బాలయ్య సైన్ చేశారట. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుందట. అయితే బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేయాల్సిన సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. స్క్రిప్ట్‌పై పని చేసేందుకు మరింత సమయం కావాలని బోయపాటి కోరుకున్నారట. ప్రస్తుతం బోయపాటి.. రామ్ పోతినేనితో చేస్తున్న మూవీ విడుదలైన తర్వాతే బాలయ్య మూవీ స్క్రిప్ట్‌పై ఫోకస్ చేయనున్నారట.

Balakrishna New Movies List : మరోవైపు, హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మకు సైతం బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినికిడి. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌లతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం బాలయ్య చర్చలు జరుపుతున్నారట.

ఇవన్నీ కాకుండా.. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్‌ కూడా లైనప్‌లో ఉంది. ఆదిత్య 369 మూవీకి సీక్వెల్‌గా ఆదిత్య 999 తెరకెక్కించేందుకు బాలయ్య ఎప్పటి నుంచో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించనుండగా.. తనయుడు మోక్షజ్ఞ కూడా ఇందులో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంది.

బాలయ్య ఈజ్​ గోల్డెన్​ లయన్​.. NBK 108 టైటిల్​ రిలీజ్​ ముహుర్తం ఫిక్స్​!
NBK 108 Title : మరోవైపు, అనిల్​ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్​ను మేకర్స్​ ప్రకటించారు. శుక్రవారం ఉదయం 9.10 గంటలకు సినిమా టైటిల్​ను రివీల్​ చేయనున్నట్లు తెలిపారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్​బీకే 108కు 'భగవంత్ కేసరి' అనే టైటిల్​ను పరిశీలించారట. దాన్నే ఖరారు చేశారట.

బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్​ను గ్రాండ్​గా రివీల్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అందుకు కాస్త డిఫరెంట్​గా ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని 108 లొకేషన్లలో భారీ హోర్డింగ్స్​ను ఏర్పాటు చేసి.. వాటిపై టైటిల్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్​ చేసింది. 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details