తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NBK108 రిలీజ్ డేట్​ రివీల్​.. విజయ దశమికి ఆయుధపూజ - బాలకృష్ణ అనిల్ రావిపూడి రిలీజ్ డేట్​

నందమూరి నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపుడి కాంబోలో తెరెకెక్కుతున్న ఎన్​బీకే 108 నుంచి శుక్రవారం ఓ సాలిడ్ అప్డేట్ వచ్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.​

nbk 108
nbk 108 release date

By

Published : Mar 31, 2023, 1:57 PM IST

Updated : Mar 31, 2023, 2:58 PM IST

ఈ ఏడాది సంక్రాంతి జాతరలో నందమూరి నటసింహం బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. డైరెక్టర్​ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లుకు పైగా కలెక్షన్లను అందుకుంది. అయితే.. ఈ జోష్​లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్​ను దర్శకుడు అనిల్​రావిపూడితో ప్రకటించారు. వరుస హిట్లతో సక్సెస్​ఫుల్​ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడితో కలిసి NBK108 చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. అలా 'అఖండ', 'వీరసింహారెడ్డి' బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్​ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పుడు NBK 108 సినిమా శరవేగంగా షూటింగ్​ కొనసాగిస్తున్న తరుణంలో అభిమానుల కోసం ఓ క్రేజీ అప్డేట్​ను తీసుకొచ్చింది మూవీ టీమ్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్​ రావిపుడి ఓ మాస్​ పోస్టర్​తో పాటు ట్విట్టర్​లో​ పోస్ట్​ చేశారు. దశమికి ఆయుధపూజ అనే క్యాప్షన్​ను కూడా జోడించారు. కాగా, శ్రీరామనవమి సందర్భంగా అప్డేట్​ను ఇస్తారనుకున్న మేకర్స్​.. ఒక్క రోజు ఆలస్యంగా ఈ అప్డేట్​ ఇచ్చారు. ఇప్పటికే ఉగాదికి విడుదల చేసిన ఫస్ట్​ లుక్​లో అదిరిపోయిన బాలయ్య.. తాజా పోస్టర్​లో పవర్‌ ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇందులో బాలయ్య కూడా తెలంగాణ స్లాంగ్‌లోనే మాట్లాడబోతున్నారని అని సమాచారం.

బాలయ్య మార్క్ మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లతో పాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి మార్క్ కామెడీ.. ఈ చిత్రంలో తెరకెక్కుతోంది. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్​పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్​ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీలా బాలయ్యకు కూతురిగా కనిపించనుంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వాస్తనావికి NBK108 కొద్ది రోజుల క్రితం పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ కూడా ఇప్పటికే పూర్తి అవ్వాల్సింది. కానీ బాలయ్య సోదరుడి కుమారుడు తారకరత్న అకస్మాతుగా గుండెపోటుతో కన్నుమూడయం వల్ల ఆ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో ఎన్​బీకే 108 షూటింగ్​కు కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్​ రీస్టార్ట్ అయి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, ఇప్పటికే దసరా బరిలో అక్టోబర్‌ 20న మాస్​ మహారాజా రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు', రామ్‌ పోతినేని- బోయపాటి చిత్రాలు విడుదల కానున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య.. దసరా బరిలో దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి:షిర్లే.. పాటల పూదోటలో విరిసిన బ్యూటీ!

Last Updated : Mar 31, 2023, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details