రాజకీయాల్లో పాద యాత్రలు చూశాం. కానీ ఇప్పుడు ఓ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం పాదయాత్ర జరగబోతుంది. ఆ సినిమానే 'కృష్ణ వ్రింద విహారి'. ఈ యాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేయబోతున్నారు యువ హీరో నాగశౌర్య.
భిన్నమైన కథలతో ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నాగశౌర్య. కానీ ఆయనకు కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. అయితే ఇప్పుడాయన తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసింది మూవీటీమ్. ఇందులో భాగంగానే హీరో నాగశౌర్య పది నగరాల్లో ఐదురోజుల పాటు పాదయాత్ర చేయబోతున్నారు. 14న తిరుపతితో ప్రారంభించి.. 15న నెల్లూరు, ఒంగోలు.. 16న విజయవాడ, గుంటూరు, ఏలూరు.. 17న భీమవరం, రాజమండ్రి.. 18న కాకినాడ, వైజాగ్‌లో చేయబోతున్నారు. అయితే ఒక్కో రోజులో రెండు మూడు నగరాల్లో ఎలా పాదయాత్ర చేస్తారో చూడాలి మరి.