తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొత్త డైరెక్టర్​ను పరిచయం చేయనున్న నాగ్​.. మలయాళ రీమేక్​కు గ్రీన్​ సిగ్నల్​! - నాగార్జున రీమేక్​ సినిమాలు

టాలీవుడ్​ అగ్ర హీరో నాగార్జున మలయాళ చిత్రాన్ని రీమేక్​ చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఆ సినిమా ఏంటంటే?

nagarjuna-to-do-malayalam-remake
nagarjuna-to-do-malayalam-remake

By

Published : Nov 24, 2022, 2:23 PM IST

Nagarjuna Malayalam Remake: టాలీవుడ్‌లోని అగ్రహీరోల్లో నాగార్జున ఒకరు. కొత్తకాన్సెప్ట్‌లతో సినీప్రియులను అలరించే ఈ టాప్‌ హీరో 'ది ఘోస్ట్‌' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకొని సినిమాలు తీయాలని నిర్ణయించుకొన్నారు.

అందుకే ఈసారి మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన 'పొరింజు మ‌రియం జోస్‌‌' అనే చిత్రాన్ని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. 2019 లో విడుదలైన ఈ మలయాళ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పు చేసి రీమేక్‌ చేయాలని నాగార్జున అనుకుంటున్నారట. కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఈ సీనియర్‌ స్టార్‌ హీరో ఈ రీమేక్‌తో మరో ప్రతిభావంతుడిని డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

'నేను లోకల్‌', 'ధమాక' చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడకు నాగ్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఘోస్ట్‌ తర్వాత ఓటీటీ సినిమాల్లోనూ నటించాలనుకుంటున్నట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details