తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు! - Naa Saami Ranga review

Nagarjuna Naa Saami Ranga Twitter Review : నేడు(జనవరి 14) విడుదలైన నాగార్జున నా సామి రంగకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్​ వస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు పెడుతున్నారు.

రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు!
రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు!

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 7:19 AM IST

Nagarjuna Naa Saami Ranga Twitter Review : సంక్రాంతి సినిమాలు వరుసగా రిలీజ్​ అవుతూ థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం(డివైడ్ టాక్​), తేజ సజ్జా హనుమాన్(బ్లాక్ బస్టర్)​​, వెంకటేశ్ సైంధవ్(డివైడ్ టాక్​)​ రిలీజ్ అవ్వగా ఇప్పుడు నాగార్జున నా సామి రంగ వంతు వచ్చేసింది. నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

అయితే, సోషల్ మీడియాలో నా సామిరంగ హడావుడి రాత్రి నుంచి పెద్దగా కనిపించ లేదు. ఇప్పుడే మొదలవుతోంది. ఎందుకంటే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ చిత్రాలకు ముందుగా ప్రీమియర్ షోలు పడినట్లుగా నా సామిరంగ సినిమాకు పడనట్లు తెలుస్తోంది. ఉదయం ఐదు గంటల సమయంలో మాత్రం ఇప్పుడు షో స్టార్ట్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ నెట్టింట్లో సందడి చేయడం ప్రారంభించారు. సినిమా టైటిల్ కార్డ్ వీడియో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Naa Saami Ranga Review :ఇకపోతే ఈ సినిమాకు తక్కువ స్క్రీన్సే దొరికినప్పటికీ పాజిటివ్​ టాక్​ను తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. సినిమా అద్భుతంగా ఉందంటూ అభిమానులు ట్విటర్​ రివ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. బ్లాక్ బాస్టర్​ అని రాసుకొస్తున్నారు. కింగ్ నాగార్జున అక్కినేని టైటిల్​ కార్డ్​తోనే ఆకట్టుకున్నారని డిజైన్​ అద్భుతంగా అంటున్నారు. ర్యాంప్​ ఆడిస్తున్నావ్ కింగు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్​ అద్భుతంగా ఉందని, ఇంట్రో ఫైట్ గూస్​ బంప్స్​ అని చెబుతున్నారు. లవ్​ స్టోరీ కూడా బాగుందని, ఇంటర్వెల్​లో అయితే వింటేజ్ నాగార్జున కనిపించారని అంటున్నారు. అల్లరి నరేశ్​ - రాజ్​ తరుణ్​ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయని, వాళ్ల యాక్టింగ్ ఎక్సలెంట్​ అని చెబుతున్నారు. కీరవాణి మ్యూజిక్ అదిరిపోయిందని తెలియజేస్తున్నారు. నాగ్ ఐకానిక్ మూమెంట్ సైకిల్ చైన్ సీన్ రిఫరెన్స్ కూడా ఉంటుందని అంటున్నారు.

కాగా, సినిమాలో నాగార్జునకు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్​ ఆషికా రంగనాథ్ నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్, మిర్నా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించగా - రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

ABOUT THE AUTHOR

...view details