ఇండస్ట్రీలోని ప్రముఖ అగ్రహీరోల్లో నాగార్జున ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా 'ది ఘోస్ట్' మూవీతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించిన నాగ్ అనుకున్న రేంజ్లో మాత్రం మెప్పించలేకపోయారు. అయితే ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మరో కొత్త ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అది కూడా 2019లో కోలీవుడ్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్ అందుకున్న ఓ మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో కలిసి ఈ కొత్త సినిమా చేయబోతున్నారని వినిపిస్తోంది. అయితే దాదాపుగా ఖరారైన ఈ సినిమా గురించి మరో ఆసక్తిక విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుందని తెలిసింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను మైసూరులో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముంది.
'పొరింజు మరియం జోస్' తెలుగులో..కోలీవుడ్ బాక్సాఫీస్ ముందు భారీ కలెక్షన్లు వసూలు చేసిన 'పొరింజు మరియం జోస్' అనే మూవీ రీమేక్‌లోనే నాగార్జున నటించనున్నారట. 2019లో విడుదలైన ఈ మలయాళ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీన్ని డైరెక్టర్ జోషీ తెరకెక్కించారు. రెజీ మోన్ నిర్మించారు. అయితే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్ది విడుదల చేయాలని నాగార్జున దర్శక నిర్మాతలకు సూచించారట.
అలా కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మన్మథుడు ఈ రీమేక్‌తో ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ డైరెక్టర్‌ను పరిచయం చేస్తున్నారు. 'నేను లోకల్', 'ధమాకా' చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన ప్రసన్న కుమార్ బెజవాడకు ఈ రీమేక్‌తో డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.