Nagachaitanya venkatprabhu movie: అక్కినేని హీరో నాగచైతన్య సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. మంచి కథలను ఎంచుకుంటూ వరుస హిట్లను అందుకుంటున్నారు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు'లతో విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయనున్నారని కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ ప్రచారం నిజమైంది. ఈ కాంబోలో మూవీ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. #ఎన్సీ 22పేరుతో దీన్ని రూపొందించనున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నట్లు వెంకట ప్రభు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది.
చైతూ కొత్త సినిమా ప్రకటన.. ఆస్కార్ విన్నింగ్ సినిమాలో అడవిశేష్ - Nagachaitanya venkat prabhu film
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో యువ హీరోలు నాగచైతన్య, అడవిశేష్ చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
![చైతూ కొత్త సినిమా ప్రకటన.. ఆస్కార్ విన్నింగ్ సినిమాలో అడవిశేష్ Nagachaitanya Adavisesh new movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14941500-thumbnail-3x2-updates.jpg)
Adavisesh oscar winning film: విభిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు యువ హీరో అడవిశేష్. ఆయన నటించిన తాజా చిత్రం 'మేజర్' మే 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన తదుపరి చిత్రాల గురించి తెలిపారు. ప్రస్తుతం తన దగ్గరకు చాలా కథలు వచ్చాయని పేర్కొన్నారు. అందులో నుంచి తాను ఓ ఆస్కార్ విన్నింగ్ సినిమాను ఎంచుకున్నట్లు చెప్పారు. "ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమాను రీమేక్ చేయబోతున్నాను. దీంతో హిందీ నేరుగా మరో చిత్రం చేయనున్నాను. కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ దీన్ని రూపొందించనున్నారు." అని అన్నారు. ఇప్పటికే శేష్.. తెలుగులో 'గూఢచారి 2', 'హిట్ 2' సినిమాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: నైజాంలో 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం.. తొలి సినిమాగా చరిత్ర