తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య 'కస్టడీ' టీజర్‌.. మీరు చూశారా? - నాగచైతన్య కస్టడీ మూవీ రిలీజ్ డేట్​

'నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం' అంటూ నాగచైతన్య 'కస్టడీ' టీజర్ రిలీజ్ అయింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దాన్ని మీరు చూసేయండి..

Nagachaitanya Custody movie teaser
పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య 'కస్టడీ' టీజర్‌.. మీరు చూశారా?

By

Published : Mar 16, 2023, 5:59 PM IST

Updated : Mar 16, 2023, 6:28 PM IST

అక్కినేని యంగ్ హీరో, లవర్ బాయ్ నాగచైతన్య.. నటిస్తున్న కొత్త చిత్రం 'కస్టడీ'. ఇందులో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంతో మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్​ను గురువారం(మార్చి 16)న రిలీజ్ చేశారు మేకర్స్​​. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ సరసన కృతిశెట్టి హీరోయిన్​గా నటిస్తోంది. 'బంగార్రాజు' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్​లో వస్తున్న సినిమా ఇది.

ఇకపోతే అభిమానులు ఊహించినట్లే ఈ కస్టడీ టీజర్ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఎంతగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటికి మించేలా టీజర్​ను బాగా రెడీ చేశారు మేకర్స్​. ఈ ప్రచార చిత్రం మూవీపై అంచనాలను పెంచుతోంది. 88 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రచార చిత్రంలో చైతూ ఎంతో ఇంటెన్స్ లుక్​లో కనిపించి.. పవర్ ఫుల్ డైలాగ్స్​తో అదరగొట్టారు.

"గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది. ఒక యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో. ఎప్పుడు వస్తుందో. ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలనీ లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం" అంటూ నాగ చైతన్య వాయిస్​తో మొదలైన ఈ టీజర్​.. "నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. ఎస్.. దట్ ట్రూట్ ఈజ్ ఇన్ మై కస్టడీ" అనే మరో పవర్ ఫుల్ డైలాగుతో టీజర్ ముగిసింది. ఇందులో చైతూ యాక్షన్​ సీక్వెన్స్​ అదిరిపోయాయి. మరి నాగ చైతన్య ఈ యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ వీడియోలో అరవింద్ స్వామి, శరత్ కుమార్​లు ప్రతినాయకులుగా కనిపించారు. థ్యాంక్యూ సినిమా డిజాస్టర్ తర్వాత చైతూ కూడా ఈ మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. అలాగే వరుస పరాజయాలను అందుకుంటున్న కృతి కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది.

ఇకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ఇంకా చెప్పాలంటే నాగ చైతన్య డైలాగ్స్​కు ఈ మ్యూజికే ప్రాణం పోసిందిని చెప్పాలి. స్క్రీన్​పై కనిపించే ప్రతి సన్నివేశాన్ని.. ఈ మ్యూజికే హైలైట్​ చేసింది. ఆడియెన్స్​లో గూస్​బంప్స్​ తెప్పించింది. మొత్తంగా ఈ ప్రచార చిత్రం అక్కినేని అభిమానులకు తెగ ఆకట్టుకుంటుంది.

ఇదీ చూడండి:మళ్లీ ప్రేమలో పడిన దీప్తి సునయన.. ఈ సారి ఎవరితో అంటే?

Last Updated : Mar 16, 2023, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details