Naga Chaitanya Emotional Note: అక్కినేని నాగచైతన్య హీరోగా.. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని జులై 22న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నాగ చైతన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నాగ చైతన్య తాజాగా తన మూవీ థ్యాంక్యూ జర్నీతోపాటు తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సమంత పెట్ హష్‌ను కూడా గుర్తు చేసుకున్నారు. ''థ్యాంక్యూ' అనేది చాలా గొప్ప పదం, మనం కొన్ని సార్లు ఎక్కువగా వాడుతుంటాం.. కొందరికి మనం ఎక్కువగా చెబుతుంటాం. కొందరికి చెప్పలేం.. అయితే నా జీవితంలో ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి' అంటూ తన తల్లి, తన తండ్రి, సమంత పెట్ హష్ ఫోటోలను షేర్ చేశారు చై.
"ఈ పోస్ట్‌ను నేను నా జీవితంలో అతి ముఖ్యమైన వారికి అంకితం చేస్తున్నాను.. వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు.. మీరంతా కూడా మీకు జీవితంలో ముఖ్యమైన వారి గురించి చెబుతూ ఫోటోలను షేర్ చేయండి.. థ్యాంక్యూ మ్యాజిక్ వర్డ్(#themagicwordisthankyou) అని హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి" అని ట్వీట్ చేశారు. "అమ్మ.. నాకు ప్రాణం.. చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమగా పెంచింది.. అనంతమైన ప్రేమను పంచింది.. నాన్నా.. ఓ స్నేహితుడి కంటే ఎక్కువగా నాతో ఉంటూ.. నాకు మార్గాన్ని చూపించారు.. హష్.. ఎలా ప్రేమించాలి.. మనిషిలా ఎలా ఉండాలి.. అని చెప్పింది.." అంటూ తన జీవితంలో ముఖ్యమైన వారి గురించి చై చెబుతూ ఎమోషనల్ అయ్యారు.