వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న అక్కినేని నాగచైతన్య మరోసారి బాక్సాఫీస్ వార్‌కు సిద్ధమయ్యారు. 'మజిలీ' తర్వాత లవ్‌స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో మీడియం రేంజ్ హిట్లను అందుకున్న ఆయన ఆ తర్వాత థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దాతో వరుసగా డిజాస్టర్లను అందుకున్నారు. అయితే తెలుగులో చైతూ చివరగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. స్టార్ డైరెక్టర్ విక్రమ్ కుమార్, అగ్రనిర్మాత దిల్ రాజు కలిసి చేసిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. సాధరణంగా చైతూ నటించిన క్లాస్ సినిమాలు దాదాపుగా ఆడియెన్స్‌ను బాగానే మెప్పించాయి. కానీ ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
చైతూ 'కస్టడీ'లోకి రూ.22కోట్లు.. వచ్చేనా? - నాగచైతన్య కస్టడీ రిలీజ్ డేట్
అక్కినేని హీరో నాగచైతన్య కస్టడీ సినిమా మరో రోజులో(మే 11) విడుదల కానుంది. మరి ఈ సినిమాతో చైతూ ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటారో?
దీంతో ఆయన ఈసారి కొంచెం మాస్ టచ్ ఉన్న.. యాక్షన్ థ్రిల్లర్ కథతో బాక్సాఫీస్ ముందుకు రానున్నారు. తమిళంలో విలక్షణ కథలతో కమర్షియల్ హిట్లను అందుకున్న డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి 'కస్టడీ' సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రం మరో రోజులో(మే 12)న తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాపై భారీగా బజ్ కనిపించడం లేదనిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వరుస ఫ్లాప్‌లు, చైతూ గత సినిమాల రిజల్ట్ ప్రభావం.. 'కస్డడీ' అడ్వాన్స్ బుకింగ్స్‌పై కాస్త పడినట్లే అనిపిస్తోంది. కొంచెం డల్‌గానే ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక తమిళంలో పూర్తిగా వెంకట్ ప్రభు ఇమేజ్ మీదే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. రూ.22 కోట్ల వరకు జరిగిందని తెలిసింది. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంత పెద్దదేమీ కాదు కానీ.. చైతూ గత రెండు సినిమాల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా టార్గెట్ కాస్త పెద్దనే అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకు మరీ ఎక్కువ ఓపెనింగ్స్‌ను ఆశించే పరిస్థితి లేదు. కానీ ఫస్డ్ డే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. ఆ తర్వాత కలెక్షన్స్ ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయి. చైతూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అవుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తవొచ్చు. గత నెలలో సాయితేజ్ 'విరూపాక్ష' కూడా తక్కువ బజ్‌తోనే రిలీజైనా.. ఫస్ట్ డే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంది. మరి అలాంటి మ్యాజిక్కే 'కస్టడీ' విషయంలో అవుతుందో లేదో చూడాలి. మరోవైపు గతవారంలో పోలీస్ కథతో వచ్చిన అల్లరినరేశ్ 'ఉగ్రం' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను అందుకోలేకపోయింది. మరి చైతూ పోలీస్ కథైనా ఆడియెన్స్‌ను మెప్పిస్తుందో లేదో. కాగా, ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో చైతూ కానిస్టేబుల్‌గా నటించారు. కృతిశెట్టి హీరోయిన్. అరవింద్ స్వామి విలన్‌గా నటించారు. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. విలన్‌ను కాపాడటమే హీరో లక్ష్యమని ఇప్పటికే నాగచైతన్య సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పేశారు.
ఇదీ చూడండి:నరేశ్-పవిత్రల 'మళ్లీ పెళ్లి' ట్రైలర్ రిలీజ్.. చూశారా?