తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒక్క సాంగ్​ కోసం 7 భారీ సెట్స్​.. చైతూకు వర్కౌట్​ అవుతుందా!

నాగచైతన్య-కృతిశెట్టి నటిస్తున్న కస్టడీ సినిమా గురించి ఓ అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ న్యూస్​ ద్వారా సినిమాకు బాగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Nagachaitanyaarat
ఒక్క సాంగ్​ కోసం 7 భారీ సెట్స్​.. చైతూకు వర్కౌట్​ అవుతదా!

By

Published : Feb 16, 2023, 4:47 PM IST

Updated : Feb 16, 2023, 5:44 PM IST

అక్కినేని హీరో నాగచైతన్య-దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్​లో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. థ్యాంక్​ యూ, లాల్​ సింగ్ చద్ధా సినిమాలు వంటి వరుస పరాజయాలు అందుకున్న తర్వాత ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు హీరోయిన్ కృతి శెట్టి కూడా ది వారియర్​, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి ఫ్లాప్​ల తర్వాత ఈ చిత్రంలో నటిస్తోంది. అలా ఈ జంట ఇద్దరు కస్టడీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో ఎలాగైనా గట్టి హిట్ అందుకోవాలని ఇద్దరూ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వచ్చింది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్​లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం భారీ సెట్స్ తీర్చిదిద్దుతున్నారని తెలిసింది. కేవలం ఒక పాట కోసమే ఏడు భారీ సెట్లు వేసినట్లు తెలిసింది. ఇందుకోసం పెద్ద ఎత్తులో ఖర్చు చేస్తున్నారట. గత రెండు చిత్రాలు పరాజయం చెందినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా తాజా చిత్రం కోసం ఇంతటి స్థాయిలో ఖర్చు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే ఈ ద్విభాషా చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. గతంలో నాగ చైతన్య – కృతి శెట్టి కలిసి బంగార్రాజు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరి జంటను మరోసారి తెరపై చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తిగా ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్​ను అందుకుంటోందో. మరోవైపు దర్శకుడు వెంకట్ ప్రభు విషయానికొస్తే.. చెన్నై 600028, గోవా, సరోజ, మనకథా లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది శింబుతో చేసిన మానాడు చిత్రం ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ఇది మంచి విజయాన్ని దక్కించుకుంది.

ఇదీ చూడండి:ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? ఈ వీకెండ్​ ఓటీటీ సినిమాల లిస్టు ఇదే!

Last Updated : Feb 16, 2023, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details