వీర సింహారెడ్డి సక్సెస్‌మీట్‌లో అక్కినేని ఫ్యామిలీపై నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని వారసులు, యంగ్ హీరోస్ నాగచైతన్య, అఖిల్ స్పందించారు. అలా అనడం సరికాదని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ నోట్‌ను పోస్ట్ చేశారు. 'ఎన్టీఆర్ , అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపర్చడం మనల్ని మనం కించపర్చుకోవడం అవుతుంది' అని అన్నారు.
బాలకృష్ణ కామెంట్స్‌పై స్పందించిన నాగచైతన్య, అఖిల్.. ఏమన్నారంటే? - బాలకృష్ణ కామెంట్స్‌పై నాగచైతన్య స్పందన
వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో తన ఫ్యామిలీపై బాలకృష్ణ చేసిన కామెంట్స్‌కు స్పందించారు అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్. అది కరెక్ట్ కాదని చెప్పారు.

Nagachaitanya akhil reacts on Balakrishna comments
TAGGED:
Balakrishna viral comments