నాగచైతన్య మూడు విభిన్న లుక్స్‌లో నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ కథానాయికలు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. విభిన్న ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ప్రచార చిత్రంలో చూపించిన సన్నివేశాలు చూస్తే అర్థమవుతోంది. క్లాస్, మాస్ గెటప్‌లో చైతన్య కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సంభాషణలు యువ హృదయాల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. సీన్‌కు తగ్గట్టు తమన్ అందించిన నేపథ్య సంగీతం వినసొంపుగా ఉంది. మరి చైతూ ప్రేమ ఎలా ఉంటుంది? ముగ్గురిలో ఎవరికి సొంతమవుతాడు? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్‌హిట్ చిత్రం 'మనం' తర్వాత విక్రమ్- చైతన్య కాంబినేషన్‌లో వస్తుండటంతో 'థ్యాంక్ యూ' పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ధూత' అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది.
నాగచైతన్య 'థ్యాంక్ యూ' ట్రైలర్ రిలీజ్.. నయనతార 75వ చిత్రం ఖరారు - nayanthara new movie
నాగచైతన్య హీరోగా నటించిన 'థ్యాంక్ యూ' సినిమా ట్రైలర్ విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో ఆమె 75వ చిత్రం ఖరారైంది. ఈ సినిమాల అప్డేట్స్ మీకోసం..
75వ చిత్రం దర్శకుడెవరంటే?:నటిగా సుదీర్ఘ ప్రస్థానమున్న అతి తక్కువ మందిలో నయనతార ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. వివాహం తర్వాతా వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే.. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో 'జవాన్', టాలీవుడ్ కథానాయకుడు చిరంజీవితో 'గాడ్ ఫాదర్' సినిమాల్లో నటిస్తున్న నయన్ తాజాగా తన 75వ చిత్రాన్ని ఖరారు చేశారు. ఈ సినిమా #LadySuperStar75 వర్కింగ్ టైటిల్‌తో మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నాద్ స్టూడియోస్, ట్రిడెంట్ ఆర్ట్స్ సంస్థలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని 'జీ స్టూడియోస్' తెలిపింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుందని పేర్కొంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రంలో జై, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించనున్నారు.