తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాగ చైతన్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ - ఆ క్రేజీ లుక్​లో పోస్టర్ రివీల్​!​ - నాగ చైతన్య ఎన్​సీ 23 మూవీ

Naga Chaitanya Latest Movie : టాలీవుడ్​ స్టార్ హీరో నాగ చైతన్య లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న 'NC 23' సినిమాకు ఓ సాలిడ్​ టైటిల్​ను ఖరారు చేశారు మూవీ మేకర్స్​. ఇంతకీ అదేంటంటే?

Naga Chaitanya Latest Movie
Naga Chaitanya Latest Movie

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 3:00 PM IST

Updated : Nov 22, 2023, 3:29 PM IST

Naga Chaitanya Latest Movie : టాలీవుడ్​ స్టార్ హీరో నాగ చైతన్య లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న 'NC 23' సినిమాకు ఓ సాలిడ్​ టైటిల్​ను ఖరారు చేశారు మూవీ మేకర్స్​. నవంబర్​ 23న చైతూ బర్త్​డే స్పెషల్​గా విడుదలైన ఓ పోస్టర్​ ద్వారా ఈ అనౌన్స్​మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 'తండేల్' అనే టైటిల్‌ను రివీల్​ చేశారు. షూటింగ్​ త్వరలో మొదలవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్​ర్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

NC 23 Movie Story : ఇక మూవీ విషయానికి వస్తే.. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని 'వీరవల్‌'కు వెళ్లి సముద్రవేట చేస్తున్న కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు.. కష్టాల గురించి ఈ సినిమాలో చూపించనున్నట్లు మేకర్స్​ ఇటీవలే వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీ కాకులానికి వెళ్లిన చిత్ర బృందం అక్కడున్న మత్స్యకారులను పలకరించి..వాళ్ల అలవాట్ల గురించి తెలుసుకున్నారు.

NC 23 Movie Cast :యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న‌ ఈ సినిమాలో చైతూ సరసన కోలీవుడ్ స్టార్​.. సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇది రెండో సినిమా కావడం విశేషం. చందూ ముందేటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం నాగ చైతన్య.. తనని తాను మార్చుకున్నారు. ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు.

Naga Chaitanya Dootha Web Series : ఇప్పటి వరకు సినిమాల్లో నటించిన చైతూ.. తాజాగా 'దూత' అనే వెబ్​ సిరీస్​లో మెరిశారు. 'మనం', 'కస్టడీ' సినిమాలను తెరకెక్కించిన విక్రమ్ కె కుమార్.. ఈ వెబ్​ సిరీస్​ను రూపొందించారు. పార్వతి, తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ లాంటి స్టార్స్​ ఈ సిరీస్​లో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Naga Chaitanya in Srikakulam: మత్స్యకార గ్రామంలో నాగచైతన్య సందడి.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్​తో సినిమా..

'పనిలేక గడ్డం పెంచా'- ఫ్యాన్స్​ ప్రశ్నకు నాగచైతన్య రిప్లై!

Last Updated : Nov 22, 2023, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details