Naga Chaitanya Dhootha Trailer :టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య తొలిసారి వెబ్‌సిరీస్‌లో నటించారు. 'దూత' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. డిసెంబర్ 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే నేడు (నవంబర్ 23) చైతూ బర్త్‌డే స్పెషల్‌గా.. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Dhootha Story In Telugu :ఈ 'దూత' సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇందులో చైతూ ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తారు. 'సమాచార్' అనే న్యూస్ పేపర్లో సాగర్ అనే జర్నలిస్టుగా ఆయన కనిపించారు. అయితే నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్ పేపర్లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనిపెడుతారు. ఆ హత్యల వెనకాల ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమంలో ఆయనపై ఓ నేరారోపణ పడుతుంది. అయితే వాటన్నింటికి భయపడకుండూ చైతూ సాహాయం చేసి మిస్టరీని కనుగునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆయన చేసిన సాహాసాలు ఎలాంటివి..? అసలు చైతూ మీద ఆ నేరం ఎందుకు పడుతుంది..? చిక్కుల్లో పడిన ఒక జర్నలిస్ట్ వాటి నుంచి బయటపడ్డారు అనేది తెలియాలంటే డిసెంబర్ 1 వరకు వేచి చూడాల్సిందే.
Dhootha Telugu Movie Cast And Crewcrew: ఇక నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' లాంటి సినిమాలను తెరకెక్కించిన విక్రమ్ కె. కుమార్ ఈ 'దూత'ను రూపొందించారు. ఇందులో చైతూతో పాటు ప్రియ భవానీ శంకర్, పార్వతీ తిరువోతు, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. చైతూకి ఇది ఓ కొత్త ప్రయత్నం. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.