Nag Aswin Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. 'మహానటి' ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకుణె, దిశాపటానీ లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ 'కల్కీ'ని మేకిన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని.. వీఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఇండియాలోనే చేయాలనుకున్నామని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఉన్న కథ, దాని అంచనాల కారణంగా ఈ సినిమాకు హాలీవుడ్ కంపెనీస్‌తో కలిసి గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సివచ్చిందని తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఇండియాలోనే చేశామని తెలిపారు. అంతే కాకుండా యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో భవిష్యత్తులో హాలీవుడ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థలు ఇండియాలోనే ఉన్నాయని.. తన తర్వాతి ప్రాజెక్టులకు పూర్తిగా ఇక్కడి టాలెంట్‌ను ఉపయోగించుకుని కంప్లీట్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా తయారు చేస్తానని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
Kalki 2898 Latest Posters : తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన మూవీ టీమ్.. రిలీజ్ చేసిన ఓ పోస్ట్‌ర్ అందరిని ఆకట్టుకుంది. 'కల్కి' సినిమాలోని అమితాబ్ లుక్‌ను ఆ పోస్టర్లో రివీల్ చేసింది. అందులో సాధువులా కనిపించిన అమితాబ్ తన కొత్త లుక్‌తో అభిమానులను ఆకర్షించారు. అంతే కాకుండా ప్రభాస్ బర్త్‌డేకు కూడా మేకర్స్ సూపర్ పోస్టర్‌ను రివీల్ చేశారు. అది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.