Naa Saami Ranga Trailer :టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున లీడ్ రోల్లో వస్తున్న తాజా మూవీ 'నా సామి రంగ'. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. అల్లరి నరేశ్, యంగ్ హీరో రాజ్ తరుణ్, కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్‌తో పాటు ఫుల్ ఆన్ ఎనర్జిటీక్ సీన్స్‌తో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకునేలా మేకర్స్ దీన్ని విడుదల చేశారు. ఇక ట్రైలర్ చివరిలో నాగ్ సిగరెట్ వెలిగించుకునే సీన్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది.
Naa Saami Ranga Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే - మలయాళ సూపర్ హిట్ మూవీ 'పోరింజు మరియం జోస్'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుందంటూ గతంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టు సిద్ధం చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. గతంలో విడుదలైన గ్లింప్స్ కూడా అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెంచేసింది.