Naa Saami Ranga Thanku You Meet:అక్కినేని నాగార్జున కొత్త చిత్రం 'నా సామిరంగ' ఆదివారం (జనవరి 14)న రిలీజై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి ఫైట్‌లో నాగార్జున మరోసారి సక్సెస్ అందుకున్నారు. మార్నింగ్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈవినింగ్, నైట్ షోస్‌కు బుకింగ్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో మూవీయూనిట్ హైదరాబాద్‌లో థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ మీట్లో హీరో నాగార్జున, అల్లరి నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
'నా సామిరంగ' ఫలితం తనకెంతో సంతోషాన్నిచ్చిందని నాగార్జున అన్నారు. 'మమ్మల్ని ఆదరించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థాంక్యూ. ఈ సినిమాతో నా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వాళ్లు ఆనందాన్ని చూస్తుంటే నాకు తృప్తిగా ఉంది. పొద్దున్నుంచి ఫ్యాన్స్ అందరు కంగ్రాట్స్ అని టీచీపై రాసి ఇంట్లో పడేస్తున్నారు. ఇలాంటి సినిమాలే తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అక్కినేని అభిమానులందికీ మరోసారి ధన్యవాదాలు' అని నాగార్జున అన్నారు.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువగా ఉండడం వల్ల 'నా సామిరంగ' కు థియేటర్లు తక్కువ లభించాయని రిలీజ్‌కు ముందు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు మూవీకి మంచి టాక్ రావడం వల్ల రేపట్నుంచి పలు ఏరియాల్లో స్క్రీన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. మరోవైపు బుకింగ్స్ (Bookings) కూడా స్పీడ్‌గా పెరిగాయి. ఈవినింగ్ షోస్ అక్యుపెన్సీ (Occupancy) 72.31 శాతం నమోదైనట్లు తెలిసింది.