Adipurush 3D Movie : ఎక్కడ చూసినా ఇప్పుడు 'ఆదిపురుష్' గురించే ప్రస్తావన. మరో మూడు రోజుల్లో సందడి చేయనున్న ఈ సినిమాను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కాంట్రవర్సీలతో మొదలై ఇప్పుడు భారీ స్థాయిలో పాజిటివిటీని అందుకుంది. టీజర్ తర్వాత రిలీజైన ట్రైలర్స్, 'జై శ్రీ రామ్', 'రామ్ సీతా రామ్' లాంటి సాంగ్స్ సినిమా రేంజ్‌ను పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు రెండు మూడు రోజుల నుంచి సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతన్నాయి.
త్రీడీలో హైలైట్స్ ఇవే..
Adipurush 3D Shows : ఈ మూవీ 2డీతో పాటు త్రీడీలోనూ రిలీజ్ కానుంది. అయితే టీజర్, ట్రైలర్ చూసిన అభిమానులకు సినిమా ఎలా ఉండనుందో ఓ అంచనాకు వచ్చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్‌లో రాముడు-సీత మధ్య ఉన్న భావోద్వేగ ప్రేమ సన్నివేశాలు, సీత అపహరణ, లంకా దహనం, రావణ సంహారం లాంటి ఎపిసోడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ వెబ్సైట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన రివ్యూలో.. సినిమాలో ఏఏ సన్నివేశాలు హైలైట్‌గా ఉండనున్నాయి, ముఖ్యంగా 3డీలో ఆకట్టుకునే సన్నివేశాలు ఏంటనేది తెలిపింది. వాలి-సుగ్రీవుల ఘర్షణ, శూర్పణఖ సీన్స్, రాఘవ-ఖర పోరాట సన్నివేశం, హనుమంతుడు లంకను దహించే సన్నివేశం, అలాగే సేతు నిర్మాణంతో పాటు రామ-రావణ యుద్ధం.. ఇలాంటి సన్నివేశాలు త్రీడీలో వీక్షిస్తే ఆ ఫీల్ అదిరిపోయిందంటూ ఆ సంస్థ వెల్లడించింది. ఇది పక్కా 3 డీ సినిమా మెటేరియల్ అని రాసుకొచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాను త్రీడీలోనే చూసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.