Guntur Kaaram Music Director : గత కొంత కాలంగా మహేశ్ 'గుంటూరు కారం' సినిమా చుట్టూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ నుంచి పీఎస్ వినోద్ తప్పుకుని ఆయన స్థానంలో రవి కె చంద్రన్ వచ్చారన్న వార్తలు హల్చల్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది.
గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఆ రూమర్స్‌కు చెక్‌పెట్టేలా అటు నిర్మాత నాగ వంశితో పాటు ఇటు తమన్ కూడా పరోక్షంగా ఓ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ సినిమాకు తమన్ బాణీలు కట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఆయన విషయంలో మరోసారి రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
వాస్తవానికి తమన్ ఇచ్చిన ట్యూన్స్ ఏవీ మహేశ్‌కు నచ్చలేదట. అయినపట్టికీ త్రివిక్రమ్ సూచన మేరకు ఆయన ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారట. కానీ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో తమన్‌ను పక్కనపెట్టాలని మూవీటీమ్ నిర్ణయించుకుందట. ఆయన స్థానంలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టే విషయం గురించి మూవీ యూనిట్ చర్చలు జరుపుతోందట.
ఈ క్రమంలో నాలుగు పాటలకు హేశం అబ్దుల్ వహాబ్, రెండు మాస్ సాంగ్స్‌కు భీమ్స్ సిసిరిలియో బాణీలు కడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. ఇదే విషయాన్ని మహేశ్ ముందు ఉంచినట్టు తెలిసింది. ఇక ఈ ప్రపోజల్‌కు మహేశ్ ఓకే చెబుతారా లేదా చూడాలి.ఒకవేళ ఇది నిజమైతే ఈ సినిమాకు హేశం, భీమ్స్ మంచి ఛాయిస్ అవుతారు. ఒకరు తమ స్వీట్ మెలడీతో ప్రేక్షకులను అలరిస్తే.. ఇంకొకరేమో మాస్ బీట్తో మంచి ఊపు తెప్పిస్తారు. దీంతో ఈ బాధ్యతలు వీరికి అప్పజెప్పితే సినిమాకు మంచి ఆల్బమ్ దొరుకుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Babu Vacation : అయితే గతం నుంచే ఈ సినిమా విషయంలో అనేక మార్పులు జరిగాయి. సినిమాటోగ్రాఫర్ కంటే ముందే ఈ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకోగా.. ఆమె స్థానంలో శ్రీలీలను లీడ్ రోల్లో తీసుకున్నారు. ఇక సెకెండ్ హీరోయిన్గా హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ షెడ్యూల్స్ విషయంలో మాత్రం నత్త నడక సాగుతున్నట్లు తెలుస్తోంది. మహేశ్ కూడా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో తన షెడ్యూల్‌తో పాటు ఇతర షెడ్యూల్స్ కూడా బ్రేక్ పడినట్లు అనిపిస్తోంది. ఇన్ని వాయిదాల నడుమ సినిమా అనుకున్న సమయానికి రాదేమో అన్న అనుమానాలు సైతం అభిమానుల్లో తలెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: