తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒక్క ఫొటోతో రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చిన తమన్.. అద్భుతమైన రోజంటూ.. - రామ్​చరణ్​ ఆర్సీ 15

స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​.. ఒక్క ఫొటోను షేర్​ చేస్తూ రెండు సినీ అప్డేట్స్​ ఇచ్చారు. ప్రస్తుతం తమన్​ చేసిన ఆ పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇంతకీ ఆయన ఇచ్చిన ఆ రెండు అప్డేట్స్ ఏంటంటే?

taman ramcharan
taman ramcharan

By

Published : Sep 8, 2022, 6:50 PM IST

Music Director Tweet: 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా తర్వాత.. డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో హీరో రామ్​చరణ్​ నటిస్తున్న 'RC 15' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో కియారా హీరోయిన్​గా నటిస్తున్నారు.

అయితే గత కొద్దిరోజులుగా 'RC 15' సినిమా విడుదలపై పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'RC 15' మూవీకి బాణీలు అందిస్తున్న తమన్.. ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేశారు. మ్యూజిక్ రికార్డింగ్‏లో భాగంగా రామ్ చరణ్‏తో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ''RC 15'లో భాగంగా నా సోదరుడు రామ్​చరణ్​తో కలిసి పనిచేశాను. ఇదొక అద్భుతమైన రోజు. అలాగే 'గాడ్ ​ఫాదర్'​ అక్టోబర్​ 5న వచ్చేస్తున్నాడు' అంటూ రాసుకొచ్చారు. ఒక్క ట్వీట్‏తో తమన్​ రెండు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తమన్​ ట్వీట్​

డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'RC 15' రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. శ్రీవెంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చెర్రీ.. డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:'ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయా.. ఆరేళ్ల పాటు చొక్కా కూడా కొనకుండా అప్పులు తీర్చా'

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తెలుగు అందం! స్టార్ డైరెక్టర్​తో ఏడడుగులు!!

ABOUT THE AUTHOR

...view details