టీ20 క్రికెట్ పేరు వినగానే.. మనలో చాలా మందికి గుర్త్తొచ్చేది వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్. అయితే ఇతడు పేరుకే విండీస్ క్రికెటర్ కానీ.. ప్రపంచవ్యాప్తంగా అనేక టోర్నీల్లో ఆడి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. క్రికెట్ అభిమానులు ఎంతగానో మెచ్చే ఐపీఏల్ టోర్నీలోనూ అతడు ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున ఆడి గేల్.. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా గేల్.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను కలిశాడు. వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ మారింది. అసలు వీళ్లిద్దరూ ఎందుకు కలిశారంటే?
గేల్‌తో తమన్ క్రేజీ సెల్ఫీ.. ఎందుకు కలిశారో తెలుసా? - క్రిస్ గేల్ తమన్ సెల్పీ
వెస్టండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్, టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కలిసి దిగిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి క్రికెట్లో సిక్సులతో హోరెత్తించే గేల్.. తన పాటలతో కేక పుట్టించే తమన్ ఒక్కచోట కలవడం చాలా సంతోషంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అసలు వారిద్దరు ఎక్కడ కలిశారంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో సినీ ఇండస్ట్రీ సెలబ్రెటీల మధ్య టోర్నీ జరుగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా 8 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి. వీటి మధ్య ఆరు నగరాల్లో 19 మ్యాచులు జరగనున్నాయి. అందులో భాగంగా ఇటీవలే మలయాళ స్టార్స్, తెలుగు వారియర్స్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. కెప్టెన్ అఖిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో విజయం కూడా సాధించింది. తెలుగు వారియర్స్ జట్టులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండు విభాగాల్లోనూ తన వంతు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
కాగా, తమన్.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో పాటు కన్నడ చలనచిత్ర కప్ అనే మరో టోర్నీలోనూ ఆడుతున్నాడు. కర్ణాటకలో జరిగే ఈ టోర్నీలో ఆరు టీమ్స్ పాల్గొంటున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు పలువురు యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా పాల్గొంటారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని స్టేడియంలో గేల్, తమన్ కలిశారు. ఈ క్రమంలోనే తీసుకున్న ఫొటోను తమన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మరి క్రికెట్లో సిక్సులతో హోరెత్తించే గేల్.. తన పాటలతో కేక పుట్టించే తమన్ ఒక్కచోట కలవడం చాలా సంతోషంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.