తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

''వీరసింహారెడ్డి'తోనూ స్పీకర్లు పగలడం పక్కా.. జాగ్రత్త!' - తమన్​ లేటెస్ట్ న్యూస్​

ఓ సినిమాకు కథ ఎంత ముఖ్యమో పాటలు అంతే ముఖ్యం. దర్శకుడు మంచి కథనంతో ముందుకొస్తే దాని బట్టి మంచి బాణీలను కట్టగలనని సంగీత దర్శకుడు తమన్​ అన్నారు. సంక్రాంతి బరిలోకి తన రెండు సినిమాలు వేళ రానున్న మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

Music Director Thaman Interview
Music Director Thaman Interview

By

Published : Jan 11, 2023, 7:28 AM IST

"ఓ సినిమాకి బేస్‌మెంట్‌ దర్శకుడే. అతను మంచి సినిమా తీస్తేనే నేను మంచి సంగీతం అందివ్వగలను" అన్నారు సంగీత దర్శకుడు తమన్‌. ఆయన స్వరాలందించిన 'వారసుడు', 'వీరసింహారెడ్డి' చిత్రాలు రెండూ సంక్రాంతి బరిలో వినోదాలు పంచనున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు తమన్‌. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..

ఈ పండక్కి రెండు పెద్ద చిత్రాలతో వస్తున్నారు. ఎలా ఉంది?
"మాకు గత రెండు నెలలు పిండి ఆరేసినట్లు ఉంది (నవ్వుతూ). బాలకృష్ణ పక్కా కల్ట్‌ సినిమా ఓవైపు.. ఎమోషన్స్‌తో నిండిన విజయ్‌ పక్కా ఫ్యామిలీ చిత్రం మరోవైపు. రెండూ విజయవంతమవుతాయని నమ్మకంగా ఉన్నాం. నా నుంచి ఇలాంటి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలో నిలవడం ఇదే తొలిసారి".

సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఉంటుంది. ఆ విషయంలో ఏమైనా ఒత్తిడి ఉందా?
"పోటీ అనేది ప్రతి చోటా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్‌ వస్తుంది. ఆరోగ్యకరమైన పోటీ మంచి విషయమే కదా. తెలుగు సినిమా ఇప్పుడు మంచి స్థితిలో ఉంది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా".

'వీరసింహారెడ్డి' ఎలా ఉంటుంది?
"బాలకృష్ణ గత సినిమా 'అఖండ'కు పూర్తి భిన్నమైన చిత్రమిది. కల్ట్‌ మూవీలా ఉంటుంది. సిస్టర్‌ సెంటిమెంట్‌తో భావోద్వేగభరితంగా ఉంటుంది. బాలయ్య రెండు పాత్రల్నీ దర్శకుడు గోపీచంద్‌ మలినేని చాలా బాగా డిజైన్‌ చేశారు. సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే సంగీతం కూడా అద్భుతంగా ఇచ్చే అవకాశం దొరికింది. ఈ చిత్ర ద్వితీయార్ధంలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు అదరగొడతాయి. పాప్‌కార్న్‌ తినే సమయం కూడా ఉండదు".

'అఖండ'తో స్పీకర్లు పగలగొట్టారు. మరి ఈసారి ఎలా ఉంటుంది?
"వీరసింహారెడ్డి తోనూ స్పీకర్లు పగులుతాయి. జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణను చూస్తేనే ఎక్కువ వాయించేయాలనిపిస్తుంది. నన్నేం చేయమంటారు (నవ్వుతూ). ఆయన కటౌట్‌ అలా ఎక్కువ మ్యూజిక్‌ అడుగుతుంది".

కొత్త చిత్ర విశేషాలేంటి?
"రామ్‌చరణ్‌ - శంకర్‌ల సినిమా పాటలన్నీ పూర్తయ్యాయి. మహేష్‌బాబు సినిమా పాటలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి".

ABOUT THE AUTHOR

...view details