తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మ్యూజిక్ డైరెక్టర్​ కీరవాణి ఇంట్లో విషాదం - కీరవాణి తల్లి కన్నుమూత

సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు.

Music director Keeravani mother died
మ్యూజిక్ డైరెక్టర్​ కీరవాణి ఇంట్లో విషాదం

By

Published : Dec 14, 2022, 3:15 PM IST

Updated : Dec 14, 2022, 5:15 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలోకి మునిగిపోయింది. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె రాజమౌళికి పిన్ని కూడా అవుతారు.

మూడు రోజుల నుంచి ఆస్పత్రిలోనే.. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం ఆమెను చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మరికాసేపట్లో కీరవాణి నివాసానికి ఆమె పార్థివ దేహాన్ని తరలించనున్నట్లు తెలిసింది.

కాగా, దర్శకుడు రాజమౌళికి కీరవాణి కజిన్ అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివ శక్తి దత్త అన్నదమ్ములు. శివ శక్తి దత్త కూడా పరిశ్రమకు చెందినవారే. ఆయన స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్ కూడా. తండ్రి సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. టాలీవుడ్​లో సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి మొదటి చిత్రం నుంచి ఆర్ఆర్​ఆర్​ వరకు కీరవాణినే సంగీతం అందించారు.

ఇదీ చూడండి: ట్రాన్స్​జెండర్​గా మారిన ఈ స్టార్ యాక్టర్​ను గుర్తుపట్టారా?

Last Updated : Dec 14, 2022, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details