తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆదిపురుష్​' ప్రీరిలీజ్ ఈవెంట్.. ముంబయి టు తిరుపతి బైక్‌ జర్నీ.. అతుల్​ సాహసం! - ఆదిపురుష్​ అతుల్​ సంగీతం

Adipurush Pre Release Event : మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్- అతుల్ ద్వయం బాలీవుడ్​లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరిలో ఒకరైన అతుల్.. తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్​ ప్రీ రిలీజ్​ఈవెంట్​ కోసం బైక్​ ముంబయి నుంచి తిరుపతికి వెళ్లనున్నారు. ఆ సంగతులు..

Music Director Atul travelling Mumbai to Tirupati on bike for Adipurush pre release event
Music Director Atul travelling Mumbai to Tirupati on bike for Adipurush pre release event

By

Published : Jun 3, 2023, 5:11 PM IST

Adipurush Pre Release Event : ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మూవీపైనే చర్చ సాగుతోంది. పాన్​ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 16వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. తాజాగా, ఈ ఆదిపురుష్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ స్థాయిలో ఈ ఈవెంట్ జరగనుంది.

Adipurush Tirupathi : జూన్ 6వ తేదీన తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుందని తెలిపింది. మరో మూడు రోజుల్లో అంటే జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పింది. ఇందుకు సంబంధించి యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను కూడా రిలీజ్​ చేసింది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. వందలాది మంది సింగర్స్, డ్యాన్సర్స్ పర్ఫార్మెన్స్‌లు ఈ ఈవెంట్‍లో ఉంటాయని తెలుస్తోంది.

Atul Bike Journey : అయితే ఈ చిత్రానికి సంగీతం అందించిన.. మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్- అతుల్ ద్వయం బాలీవుడ్​లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో ఒకరైన అతుల్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేయడానికి సిద్ధం అయిపోయారు. బైక్‌పై ముంబయి నుంచి తిరుపతికి ఆయన వెళ్లనున్నారు. జూన్ 3న రాత్రి ముంబయిలో బయలుదేరి జూన్ 5న తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతి చేరుకున్న తర్వాత అజయ్​తో కలిసి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జైశ్రీరామ్ పాటను సమర్పించనున్నారు.

సాధారణంగా ఇలాంటి పనులు బైక్ రైడర్స్ చేస్తూ ఉంటారు. అయితే సంగీత రంగంలో తొలిసారిగా ఓ సంగీత దర్శకుడు సినిమాపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఈ విధంగా ముంబయి నుంచి తిరుపతికి బైక్ రైడ్ చేయబోతున్నారు. మరోవైపు, ప్రభాస్ అభిమానులు తిరుపతిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నగరంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే అక్కడివారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details