తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అనిరుధ్ బాబు బాగా బిజీ.. ఓకేసారి 10 బడా చిత్రాలతో! - Music Director Anirudh 10 big movies

యంగ్​ సెన్సేషన్​ అనిరుధ్ రవిచందర్​తో కలిసి పనిచేసేందుకు బడా దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చేతిలో 10 పెద్ద చిత్రాలో ఫుల్​ బిజీగా ఉన్నారు. ఆ వివరాలు..

Anirudh
అనిరూధ్ బాబు బాగా బిజీ.. ఓకేసారి 10 బడా చిత్రాలతో!

By

Published : May 31, 2023, 10:08 PM IST

Updated : May 31, 2023, 10:52 PM IST

Tamil Music Director Anirudh Upcoming Movies : సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్​​ అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు కొన్నే ఉన్నాయి. అందులో అనిరుధ్​ రవిచంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. సౌత్ సినిమా​ ఇండిస్ట్రీలో ఈ యువ సంచలనం తనదైన మార్క్ పాటలతో ఓ స్పెషల్ ఇమేజ్​ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ మాయజాలమే నడుస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసేలా మ్యూజిక్‌ అందించే టాలెంట్‌ ఈ స్టార్ సొంతం. బడా దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎవరైనా ఉన్నారా..? అంటే.. మ్యూజిక్‌ లవర్స్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు కూడా ఆయనదే. అందుకే ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.

కోలీవుడ్​తో పాటు టాలీవుడ్​లో ప్రస్తుతం ఆయనతోనే కలిసి పనిచేసేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎంత బిజీగా గడుపుతున్నారంటే.. తెలుగు తమిళం హిందీ ఇండస్ట్రీలో కలిపి 10కి పైగా సినిమాలకు ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం. వాటిలో దాదాపుగా అన్ని స్టార్ హీరోల చిత్రాలే.

Anirudh Ravichander Upcoming Movies : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న NTR 30 దేవరకు అనిరుధే సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన ఎలాంటి సంగీతం అందిస్తారా అనేది ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దళపతి విజయ్-లోకేశ్​ కనగరాజ్ కాంబో 'లియో'కు కూడా అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నారు.

యూనివర్సల్​ స్టార్​ కమల్-దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్​లో వస్తున్న 'భారతీయుడు 2', సూపర్ స్టార్​ రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్', బాలీవుడ్​ బాద్​ షా షారుక్ ఖాన్-అట్లీ కాంబో 'జవాన్', విజయ్​ దేవరకొండ-సమంత వీడీ 12లతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోస్​ అజిత్, శింబు నటిస్తున్న చిత్రాలకు ఈయనే స్వరలా సమకూరుస్తున్నారు. ఇంకా మరికొన్ని ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయట.

కాగా, అనిరుధ్.. 2021లో కోలీవుడ్​లో మాస్టర్​, డాక్టర్​, బీస్ట్​, 2022లో కాతువాకుల రెండు కాదల్, డాన్, విక్రమ్, తిరు వంటి సినిమాలకు సంగీతం సమకూర్చారు. అలా గత రెండేళ్లలో ఆయన అందించిన సంగీతం, పాటలు ప్రతీది బ్లాక్ బస్టర్ హిట్​ అయ్యాయి. దీంతో 2023లో అనిరుధ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్​గా మారిపోయారు.

Anirudh Ravichander Telugu Movies list : ఇకపోతే ఇప్పటికే గతంలో తెలుగులో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ నటించిన​ 'అజ్ఞాతవాసి' సినిమాకు అనిరుధ్ మ్యాజిక్ అందించారు. ఎన్టీఆర్ 'అరవింద సమేత'కు మొదట ఆయనే ఇవ్వాల్సి ఉండగా అది కుదరలేదు. ఇప్పుడు NTR 30 'దేవర'తో ఆ కాంబినేషన్ సెట్ అయింది.

ఇదీ చూడండి : చీరలో అనసూయ హొయలు.. మలైక, జాన్వీ గ్లామర్​ షో

ఘాటుగా SSMB 28 మాస్​​ స్ట్రైక్​ టైటిల్​.. మహేశ్ యాక్షన్​ అదిరింది!

టాలీవుడ్​లో ఇప్పుడంతా వారి 'మ్యూజిక్కే' ట్రెండ్.. అంతా అక్కడోళ్లే!

Last Updated : May 31, 2023, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details