‘అర్జున్‌రెడ్డి’తో సెన్సేషనల్ హీరోగా మారిపోయారు నటుడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ వేరే లెవల్. ఆయన హీరోగా పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘లైగర్’ టీమ్ ప్రమోషన్స్ ఆరంభించింది. ఇందులో భాగంగా విజయ్-అనన్య ఆదివారం సాయంత్రం ముంబయిలోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు.
తెలుగు హీరోనా మజాకా.. ఇదేం క్రేజ్‌రా సామీ..! - vijay devarakonda
సాధారణంగా ఓ సినిమా విడుదలయ్యాక దాన్ని ఆధారంగా చేసుకొని నటీనటులకు ప్రేక్షకుల్లో క్రేజ్ రావడం మనం చూస్తుంటాం. కానీ, సినిమా విడుదలకు ముందే ఓ టాలీవుడ్ హీరోకు బాలీవుడ్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ హీరోకు ముంబయిలోని ఫాలోయింగ్ చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ, ఆ హీరో ఎవరు? అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా జరిగిన సంఘటన ఏంటో మీరే చూసేయండి.
విజయ్ వస్తున్నాడని తెలుసుకొన్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ వాణిజ్య సముదాయం అభిమానులతో నిండిపోయింది. అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడంతో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది అమ్మాయిలు స్పృహ తప్పి పడిపోయారు. అభిమానుల్ని కంట్రోల్ చేయడం కోసం.. కార్యక్రమం ముగియకముందే విజయ్, అనన్యలను అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఒక టాలీవుడ్ హీరోకి ముంబయిలో ఉన్న క్రేజ్ చూసి నెటిజన్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదేం క్రేజ్’’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇవీ చదవండి:కార్తికేయ-2 ప్రచారంలో పాల్గొనకపోవడంపై అనుపమ క్లారిటీ.. కారణం అదే!