తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పాపం బోనీ కపూర్​.. లక్షలు స్వాహా చేసిన దుండగులు! - బోనీ కపూర్ క్రెడిట్​ కార్డు

Boney Kapoor Credit Card: ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డును గుట్టుచప్పుడు కాకుండా వాడేసి రూ.3.82 లక్షలు ఖర్చు చేసేశారు దుండగులు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు కోసం కాల్ చేసినప్పుడు జరిగిన మోసాన్ని తెలుసుకున్న బోనీ కపూర్​ సహాయకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Boney Kapoor Credit Card
Boney Kapoor Credit Card

By

Published : May 27, 2022, 6:02 PM IST

Boney Kapoor Credit Card: ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మోసపూరితంగా రూ.3.82 లక్షల లావాదేవీలు జరిపారని.. గుర్తు తెలియని వ్యక్తిపై ఫిర్యాదు నమోదైందని ముంబయి పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. బోనీకపూర్ సహాయకుడు ఈ ఫిర్యాదు చేశారని వివరించారు.

ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం బుధవారం అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బోనీ కపూర్ వివరాలు, పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడం ద్వారా ఫిబ్రవరి 9న ఐదు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడానికి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 30న తన ఎగ్జిక్యూటివ్ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు కోసం కాల్ చేసినప్పుడు జరిగిన మోసాన్ని బోనీ కపూర్ తెలుసుకున్నారు. అయితే దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details